పిల్లల వ్యాక్సిన్: పేరెంట్స్ అంతా మేల్కోండి... !

VAMSI
కరోనా వచ్చి ప్రపంచ దేశాలలో అల్ల కల్లోలం సృష్టించింది. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ రావడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పెద్దలకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా ఇపుడు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. చిన్నారులపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంది అని అధ్యయనాలు జరిపి మరి కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుండి 15 సంవత్సరాలు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.
ఆలస్యం చేయకుండా ఈ వయసు పిల్లలు ఉన్న తల్లితండ్రులు జాగ్రత్త పడి తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడం ఉత్తమం అని సూచించింది. అయితే ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్ పిల్లలకు వ్యాక్సిన్ అంటే చాలా కంగారు పడుతున్నారని, నిజానికి అన్ని విధాలుగా పరీక్షించి, అధ్యయనం చేశాక సురక్షితం అని తెలిసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుని కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 15 ఏళ్ల వయసు పైబడిన పిల్లల తల్లితండ్రులు తమ పిల్లల వ్యాక్సినేషన్ కొరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.
* మీ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ముందు ఎటువంటి మెడిసిన్ వాడరాదు,.
* ఆరోగ్యం చక్కగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉండాలి. వీలైతే ఒకసారి డాక్టర్ ని సంప్రదించి వ్యాక్సిన్ వేయించడం మరి ఉత్తమం.
* వ్యాక్సిన్ ను తీసుకునే ముందు పిల్లల తల్లిదండ్రులు వారి బిడ్డల పేర్లను టీకా కోసం ముందుగానే రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.  జనవరి ఒకటి నుండి రిజిస్ట్రేషన్, 3 వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియలు మొదలవుతాయి. లేదంటే నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన తర్వాత అయినా స్పాట్ లో  నమోదు చేయించుకోవచ్చు.
* అయితే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు కానీ, లేక స్కూల్ ఐడీ కార్డు కానీ అక్కడ చూపించాల్సి ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం పిల్లల తల్లితండ్రులు అలెర్ట్ అయ్యి దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి రిజిస్టర్ చేయించుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: