హ్యాట్రిక్ కొట్టనున్న కేసీఆర్.. కారణం కాంగ్రెస్సేనా..!

MOHAN BABU
బలమైన నాయకులు క్యాడర్ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది.ఆ పార్టీ లో రచ్చ మామూలుగా జరగడం లేదు. వాస్తవానికి అధికారంలో ఉండే పార్టీ నేతల మధ్య అనేక విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవిధంగా పార్టీకి గ్రూపులు, గోలే బలమని సమర్ధించుకునే నేతలు చాలామంది ఉన్నారు. అయితే ఈ గ్రూపుల లొల్లి ఆకాశమే హద్దుగా రెచ్చి పోతూండడంతోనే జనాలకు పార్టీ దూరమైపోతుంది.

 తాజాగా పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డిపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జగన్ రెడ్డి రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంతో పెద్ద గోల మొదలైంది. తాను అధిష్టానానికి రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయిందో తెలియదని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంటే లేఖను మీడియాకు లీక్ చేశారని రేవంత్  మద్దతుదారులు అంటున్నారు. ఇదే విషయమై పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మాజీ మంత్రి చిన్నారెడ్డి విచారణ జరిపారు. లేఖ లీక్ విషయమై జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగానే భావిస్తున్నట్లు చెప్పారు. తొందరలోనే వివరణ తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం ముందుకు పిలవనున్నట్లు చెప్పారు.చిన్నారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. నిజానికి పార్టీ కి ఒక కర్త-కర్మ-క్రియ అంటూ ఉండదు. ఏ నేత ఎవరి గురించయినా మాట్లాడేస్తుంటారు. షోకాజ్ నోటీసులు జారీ చేయడం వాటిని సదరు నేతలు లెక్క చేయకపోవడం మామూలుగా జరుగుతూనే ఉంటాయి.

అసలు క్రమశిక్షనే లేని ఈ పార్టీకి మళ్ళీ క్రమశిక్షణా సంఘం ఒకటి అని కూడా కాంగ్రెస్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఒకవైపు కెసిఆర్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని చెబుతూనే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఒకవేళ ప్రభుత్వానికో లెక్క కేసీఆర్ కో వ్యతిరేకంగా రేవంత్ ఏదన్నా నిరసన కార్యక్రమాలు చేపట్టినా వెంటనే 10 అడుగులు వెనక్కి లాగే నేతలు చాలామంది రెడీగా ఉంటారు. అయితే బిజెపి తెలంగాణ అంతటా బలంగా లేదు. ప్రజల నిర్ణయం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉంటే  లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీనే. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ఐక్యంగా పోరాడకుండా కేసీఆర్  కి ఛాన్స్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: