జిన్నా గోల: అంబటి ప్రశ్నకు వీర్రాజు తలపట్టుకున్నాడా..?

Chakravarthi Kalyan
ఏపీ బీజేపీ ఇప్పుడు పాకిస్తాన్ జాతి పిత మహమ్మద్ ఆలీ జిన్నా జపం చేస్తోంది. అవును.. గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ నానా హడావిడి చేస్తోంది. దేశ విభజనకు కారణమైన దేశ ద్రోహి పేరుతో గుంటూరులో టవర్ ఉండటం ఏంటని ప్రశ్నిస్తోంది. రెండు, మూడు రోజులుగా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తోంది. అయితే..అసలు గుంటూరులోని జిన్నా టవర్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది.. ఆ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటి.. అసలు ఇన్నేళ్లుగా ఎవరూ ఎందుకు ఈ అంశాన్ని హైలెట్ చేయలేదు.. ఇలాంటి బేసిక్ ప్రశ్నలు కూడా వేసుకోకుండా బీజేపీ నేతలు ఈ అంశాన్ని జనం ముందుకు తెచ్చారు.

పాకిస్తాన్ నేత పేరు చెబితే చాలు.. జనం వివేచన మరిచిపోతారని బీజేపీ నేతలకు నమ్మకం ఎక్కువ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ పార్టీనా జోకర్ పార్టీనా ఏంటి అని అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో జిన్నా టవర్స్ ను పేల్చుతామని బీజేపీ నేతలు మాట్లాడం ఏంటని ప్రశ్నిస్తున్న అంబటి.. బీజేపీ నేతలు ఏమైనా టెర్రరిస్టులా...అసాంఘిక శక్తులా .. ఆఫ్ఘనిస్తాన్ తాళిబాన్లు మీరు సమానం కారా అని ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ నేతలు నీచ సంస్తృతికి దిగజారారంటున్న అంబటి రాంబాబు.. ఓ కీలకమైన అంశాన్నిప్రస్తావిస్తున్నారు. అదేంటంటే.. జిన్నా, గాంధీ ఇద్దరూ స్వాతంత్రం కోసం, మత సానరస్యం కోసం పోరాడారని.. అసలు.. జిన్నా దేశ భక్తుడని ఏకంగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అడ్వానీ ప్రసంసించిన సంగతి బీజేపీ నేతలు మరిచిపోయారా అని నిలదీశారు. దీనిపై భాజపా నేతలు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జిన్నా టవర్ కూల్చుతామనే  భాజపా నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నారన్న అంబటి రాంబాబు.. అసలు  రాష్ట్రంలో భాజపాకు ఒటు బ్యాంక్ అసలే లేదని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: