హైదరాబాద్ : కాంగ్రెస్ స్పెషాలిటి ఇదేనా ?

Vijaya


కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తే అది వాళ్ళ తప్పుకాదు. 24 గంటలూ, 365 రోజులూ నేతల మధ్య వివాదలుండాల్సిందే. లేకపోతే పార్టీకి దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా ఉంటుంది నేతల మధ్య  వ్యవహారాలు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేద్దామని ఆలోచించినా చాలు ఎక్కడ అడుగు ముందుకు పడిపోతుందేమో అని కొందరు నేతలు పదడుగులు వెనక్కు లాగే ప్రయత్నాలు మొదలుపెతారు.



ఇపుడు రేవంత్-జగ్గారెడ్డి మధ్య గొడవ అలాగే ఉంది. కేసీయార్ ఫాంహౌస్ ఎర్రవెల్లి ముందు నిరసన చేద్దామని రేవంత్ ప్రయత్నించటం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయటం అందరికీ తెలిసిందే. ఇదే విషయం జూబ్లీహిల్స్ లో పార్టీ నేతలు,  కార్యకర్తలు-పోలీసులకు మధ్య ఒక గొడవ జరిగితే గాంధీభవన్లో మాత్రం రేవంత్-వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మద్య గొడవ జరుగుతోంది. వ్యక్తిగత ఇమేజి పెంచుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు అధిష్టానికి ఫిర్యాదుచేశారు. రేవంత్ వైఖరి మార్చుకోకపోతే రేవంత్ నే మార్చాల్సొస్తుందంటు ఘాటుగా ఫిర్యాదుచేశారు.



ఎప్పుడైతే జగ్గారెడ్డి లేఖ బయటపడిందో వెంటనే రేవంత్ కు మద్దతుగాను, జగ్గారెడ్డికి మద్దతుగాను నేతలు రంగంలోకి దిగేశారు. విషయం ఏమిటంటే కేసీయార్ కు వ్యతిరేకంగా రేవంత్ ను కార్యక్రమాలు చేయనివ్వరు. వాళ్ళు చెయ్యరు. నేతలందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటు నానా గోల చేస్తున్నారు. అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకునేట్లయితే ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఎందుకు ? అసలు అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవటం కాంగ్రెస్ లో సాధ్యమేనా ? కాంగ్రెస్ నేతల్లో స్పెషల్ ఏమిటంటే అధికారంలో ఉన్నా కొట్టుకుంటునే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నా కొట్టుకుంటునే ఉంటారు.



కొందరు నేతలైతే తమ పార్టీని బతికిస్తున్నదే వర్గాలని చెప్పుకుంటుంటారు. కానీ దాని ప్రభావం వల్లే దెబ్బతినేసిందని గ్రహించటంలేదు. పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువైపోయి చివరకు ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన విషయాన్ని కూడా జనాలకు సరిగా చెప్పుకోలేక రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా నేతలకు జ్ఞానోదయం కాకపోవటమే విచిత్రం. కాంగ్రెస్ లో ఇలాంటి నేతలు ఎక్కువమంది ఉన్నారు కాబట్టే కేసీయార్ హ్యపీగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: