హెరాల్డ్ ఫ్లాష్ 2021: రికార్డు సృష్టించిన పెళ్లి


అవువు వీరి పెళ్లి రికార్డు సృష్టించింది.  కారణం ఏమై ఉంటుందో  అని ఆలోచిస్తున్నారా ? వీరిది డెస్టినేషన్       మ్యారేజీ కాదు.  ఎగిరే విమానంలో పెళ్లి చేసుకోలేదు. వీరి పెళ్లికి భూదేవంత పీట - ఆకాశమంత పందిరి వేయనేలేదు. నీళ్ల అడుగుభాగంలో పెళ్లి చేసుకో లేదు. కనీసం ఏడడుగులు కూడా నడవ లేదు. మరి వీరి పెళ్లి ఎలా రికార్డు సృష్టించింది? జస్ట్ రివైండ్ 2021
పెళ్లంటే... తప్పట్లు, తాళాలు,  తలంబ్రాలు ఇంతేనా.. మూడే ముళ్ళు ఏడే అడుగులు అన్నీ కలిసి నూరేళ్లు.... ఈ పాట నీకు గుర్తు ఉంది కదా !  ప్రస్తుతం ట్రెండ్ మారింది కోర్టు కూడా వారికి అండగా నిలిచింది వివరాలు తెలుసుకోవాలనుందా?  2021లో జరిగిన ఈ విశేషం ఇది... చదవండి
కోవిడ్-19  కారణంగా తమ  పెళ్లి వాయిదా పడుతుందని ఆ న్యాయవాదుల జంట  భయపడ్డారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  వారికి కేరళ హైకోర్టు అండగా నిలిచింది వివరాలు ఏమిటంటే ..కేరళకు చెందిన నాయక్ బ్రిటన్లో చదువుకుంటున్నాడు ఆయనకు డిసెంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. వివాహ స్థలం కేరళ. దీంతో సొంత రాష్ట్రానికి వచ్చేందుకు విమానం టికెట్ కొనుక్కున్నరు.  కానీ విధి ఆయనను పెళ్లి పీటల మీద చేర్చలేదు. కోవిడ్ మహమ్మారి బ్రిటన్లో ప్రతాపం  చూపుతుండడంతో,  ఆదేశం ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు,  చాలా నిర్బంధాలను ఏర్పాటు చేసింది.  దీంతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు అందరూ కలిసి తిరువనంతపురం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .పరిస్థితులు అనుకూలించనందున తమ పిల్లల వివాహం  ఆన్ లైన్ లో చేయాలని,  అందుకు అనుమతులు మంజూరు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు.  తాము ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగేలా చూడాలని న్యాయస్థానాన్ని వేడుకున్నారు.  దీంతో స్థానం వీరి వాదన వినింది.  వారి విజ్ఞప్తిని అంగీకరించింది న్యాయస్థానాలు ప్రస్తుతం కేసు విచారణలను ఆన్ లైన్ లో చేస్తున్నందున వివాహం కూడా  ఆన్ లైన్ లో చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.  కోర్టు సూచన మేరకు సబ్- రిజిస్ట్రార్  ఈ జంటకు వివాహం చేశారు. భారత్ లో తొలి  ఆన్ లైన్ పెళ్లిగా ఇది చరిత్ర కెక్కింది. 2021 తీసుకువచ్చిన ఈ  ఆన్ లైన్ ఆనవాయితీ 2022కి సోపానం అవుతుందా ? కాలం నిర్ణయించాల్సిందేగా మరి !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: