తగ్గేదే లేదంటున్న సి.ఎం


"ఐఏఎస్ లు, ఐపిఎస్ లూ మీరందరూ  గతంలోకి ఒక్క సారి వెళ్లండి.  మీ శిక్షణ కాలాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏ సమయంలో అయినా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని రీకాల్ చేస్తుండి. జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేయండి.  మీ కంటూ ఒక యాక్ట్ ఉంది. దానిని మరచి పోవద్దు. ప్రజలకు న్యాయం  చేయడమే మీ కర్తవ్యం కావాలి". .. ఈ మాటలు అనిందిఎవరు ?
ఆయన కడప జిల్లాకు చెందిన ఒక వ్యాపార వేత్త.   కాలం కలసి వచ్చి తెలుగదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. టిడిపి అధినేతకు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందారు.   మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  ఘోర పరాజయం పొందిన తరువాత ఆయన మరికొందరు పార్లమెంట్ సహచరులతో కలసి  భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నాడు బిజేపి లో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు  అత్యంత సన్నిహితులు కావడం విశేషం. వీరంతా  చంద్రబాబు నాయుడి సూచన మేరకే బిజేపి లో చేరారనే వార్తలు కూడా నేటికీ హల్ చల్ చేస్తుంటాయి.  సీ.ఎం గా అందరూ పేర్కోనే ఈ రాజ్యసభ సభ్యుడి పేరు సి.ఎం. రమేష్. అందరూ ఆయనను ముద్దుగా సి.ఎం అని పిల్చుకుంటుంటారు. ఇక అసలు విషయానికి వద్దాం.
బిజేపి లో చేరిన తరువాత కూడా అంటే.. దాదాపు గత ఏడాది కాలం పై చిలుకు చాపక్రింద నీరులా తన రాజకీయ కార్యకలాపాలు సాగించిన రమేష్ ఇటీవలి కాలంలో దూకుడు పెంచారు. నవంబర్ నెలలో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చిన సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నాటి నుంచి బిజేపి నేతలు దూకుడు పెంచారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిస్తున్నారు. తాజాగా  సి.ఎం. రమేష్ కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలో తమ పార్టీ అధినాయకత్వానికి ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారాలను వివరించామని విలేఖరులతో చెప్పారు. ఇక్కడి పాలనను కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని తెలిపారు. అనువైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సి.ఎం. రమేష్ ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికార గణం పై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పోలీసులపై దూకుడు గా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: