పిల్లలపై 'ఒమిక్రాన్‌' ప్రభావము ఉంటుందా?

VAMSI
కరోనా సృష్టించిన ప్రళయానికి మొత్తం ప్రపంచమే పరుగులు తీసింది. ప్రపంచ దేశాలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గజ గజ వణికిపోయాయి. ఈ వైరస్ మొదటి దశలో వయసు పైబడ్డ వారిపై తన పంజా విసరగా..రెండవ దశలో యువతను టార్గెట్ చేసింది. చూస్తుండగానే ఈ మాయదారి వైరస్ ప్రభావానికి ఎందరో యువకులు కళ్లముందు పిట్టల్లా రాలిపోయారు. ఆ బాధ బరించలేనిది. ఇక కరోనా మూడవ దశలో ఈ వైరస్ ప్రభావం చిన్నారుల పైనే ఎక్కువ ఉండబోతుందని మెజారిటీ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో టెన్షన్ మరింత పెరిగింది. పిల్లల తల్లి తండ్రులు తమ చిన్నారుల ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని ఎంతో ఆందోళన చెందారు.
అయితే మొదటి, రెండవ దశలు వేగంగా తీవ్రంగా ప్రభావం చూపినా కరోనా మూడవ దశకు మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చింది. కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక కరోనా దాదాపు వెళ్లిపోయినట్లే అనుకుంటున్న క్రమంలో మళ్ళీ రూపాంతరం చెందిన కరోనా ఒమిక్రాన్ అంటూ వణుకు పుట్టిస్తోంది. ఇది కరోనా థర్డ్ వేవ్ అని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఒమిక్రాన్‌ను 'వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌'గా అనౌన్స్ చేసింది. కరోనా వేరియంట్ డెల్టా విషయంలో చాలా రోజులు గడిచే  బాగా అవగాహన  వచ్చిన తర్వాత గానీ 'వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌'గా ప్రకటించలేదు. అయితే... ఒమిక్రాన్‌ విషయంలో మాత్రం అతి తక్కువ సమయంలోనే అందులోనూ వంద మందికి వ్యాప్తి చెందగానే  WHO ఈ నిర్ణయానికి వచ్చి ప్రకటించింది.
పిల్లలపై  ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరాలు ఇపుడు తెలుసుకుందాం.  ఒమిక్రాన్‌ కరోనా కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందులోనూ రెండు రోజుల్లో తీసుకున్న వారిలోనూ ఈ వైరస్ సోకడం గమనార్హం. కావున అసలు ఎలాంటి వ్యాక్సిన్లు తీసుకునే చిన్నారుల్లో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందు జాగ్రత్త అవసరం అని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. చిన్నారుల్లో ఓమ్రికన్ లక్షణాలు. కరోనా లక్షణాలే ఇక్కడ కూడా కనిపిస్తాయి. జ్వరం,  జలుబు, ఎక్కువ నీరసించిపోవడం, తలనొప్పి. ముఖ్యంగా పిల్లల శరీరంపై దద్దుర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. స్వరం లో మార్పు. కరోనా ఇచ్చిన చికిత్సే  ఒమిక్రాన్‌ కి కూడా ఇస్తున్నారు. అయితే ఇది పిల్లలపై అంతా ఎక్కువ ప్రభావం చూపబోదని నిపుణులు చెబుతున్నారు. ఇది కాస్త ఊరట కలిగించే విషయమే అయినా జాగ్రత్త తప్పనిసరి. అయితే ఎంతవరకు ఇవి ప్రాభవం చూపిస్తాయి అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: