ఇంట‌ర్ : విద్యార్థులు ఆత్మ‌హ‌త్య.. బండి సంజ‌య్ ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌లేదు. ఆ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 03 వ‌ర‌కు నిర్వ‌హించి.. డిసెంబ‌ర్ 16న ఫ‌లితాలు విడుద‌ల చేసారు. అయితే కొంత మంది విద్యార్థులు ఫెయిల్ కావ‌డంతో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.  విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప‌లువురు నాయ‌కులు ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. తాజాగా  తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు అధ్య‌క్షుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.
తెలంగాణ‌లో ఇంట‌ర్మీయ‌ట్ విద్యార్థుల‌కు ఇంట‌ర్ బోర్డు షాక్ ఇచ్చింద‌ని.. విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న తీరు చూస్తుటే గుండె త‌రుక్కు పోతుంద‌ని బండి సంజ‌య్ మండిప‌డ్డారు. విద్యార్థులు ఎవ‌రూ కూడా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్దు అని.. నూరేండ్ల భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేసుకోవ‌ద్దు అని, తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పిదం కార‌ణంగానే ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారని పేర్కొన్నారు బండి సంజ‌య్‌.
కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింద‌ని.. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం అని వివ‌రించారు.  తమ చావుకు కారణం ప్రభుత్వం, కేటీఆర్ అంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దిలంచుకోవాల‌ని మండిప‌డ్డారు సంజ‌య్‌.  గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యార‌ని, ఈ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, అవినీతికి ఇంకెంత మంది బ‌లికావాల‌ని ప్ర‌శ్నించారు.
విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షలలో ఫెయిల్ కావ‌డానికి  ప్ర‌భుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు బండి సంజ‌య్‌.  విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందేన‌ని  స్పష్టం చేసారు. అదేవిధంగా ఉచితంగా రీ-వాల్యూయేషన్ చేయించాలని.. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ కూడా వెనకాడబోమని బీజేపీ రాష్ట్రఅధ్య‌క్షుడు స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: