భర్తకు తగ్గ భార్య మధులిక రావత్.. ఎలాగో తెలుసా..?

NAGARJUNA NAKKA
బిపిన్ రావత్ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి. ఆయన సతీమణి మధులిక రావత్.. భర్త వెనుక అంతే శక్తితో నిలబడ్డారు. భర్తకు తగ్గ భార్యగా.. మధులిక అమరవీరుల సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలో అతిపెద్ద ఎన్జీవో.. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోషియేషన్ కు ఆమె అధ్యక్షురాలు. నేడు ప్రమాద సమయంలోనూ.. చివరి శ్వాస వరకు భర్త వెన్నెంటే ఉన్నారు మధులిక. ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
భారత ఆర్మీకి బిపిన్ రావత్ అద్భుత సేవలు అందించారు. సీడీఎస్ గా ఉన్న బిపిన్ రావత్.. స్వస్థలం ఉత్తరాఖండ్. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలోనే పని చేసి లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా బిపిన్ ఆర్మీలోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా 2020 జనవరి 1న పదవీ బాధ్యతలు చేపట్టారు.
బిపిన్ రావత్ అసలు పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. అత్యంత ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయడంలో బిపిన్ రావత్ కు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. పదేళ్ల పాటు కౌంటర్ ఇన్ సర్జెన్సీ ఆపరేషన్ లలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ఠ్ సేవా మెడల్ వచ్చాయి.
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారు దేశం కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. బిపిన్ రావత్ మరణం తననెంతో కలచివేసిందన్నారు. బిపిన్ అసాధారణ సైనికుడనీ.. నిజమైన దేశభక్తుడన్నారు. సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునికీకరించడంలో ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన దృషఅటి అసాధారమైందన్నారు ప్రధాని. ఓం శాంతి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: