కోడి పందాల ఎఫెక్ట్: ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలే...!

M N Amaleswara rao
తెలుగు ప్రజల పెద్ద పండగ సంక్రాంతికి సమయం దగ్గరపడుతుంది. ఇంకో నెల రోజుల్లో పండగ వచ్చేస్తుంది. సంక్రాంతిని తెలుగు ప్రజలు ఏ స్థాయిలో జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రాలో సంక్రాంతి అంటే కోడి పందాలు గుర్తొస్తాయి...పండగ నాలుగు రోజులు...గోదావరి జిల్లాలు కళకళాడిపోతాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి సైతం...బందువులు పెద్ద స్థాయిలో గోదావరి జిల్లాలకు తరలివస్తారు. అయితే పండగ అంటే సంబరమే కానీ....పందాలు కోసమే వచ్చే జనాలకు గోదావరి జిల్లాల రోడ్లని చూస్తే భయపడే పరిస్తితి ఉంది.
ఎందుకంటే గోదావరి జిల్లాల్లో రోడ్లు పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రోడ్ల పరిస్తితి దారుణంగానే ఉంది. రోడ్లపై భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడకక్కడే ప్రజలు ఇబ్బందే పరిస్తితి ఉంది. అడుగుకొక గుంత...గజానికో గొయ్యి అన్నట్లు ఏపీలో రోడ్ల పరిస్తితి తయారైంది. ఎప్పటికప్పుడు సీఎం జగన్ ఏమో...రోడ్లపై గుంతలు పూడ్చేయాలని అధికారులని ఆదేశిస్తూనే ఉంటారు.
అసలు రోడ్లపై ఒక్క గుంత కూడా కనబడటానికి వీల్లేదని చెబుతారు. కానీ ఇవి మాటలకే పరిమితమవుతున్నాయని, చేతల్లో కనిపించడం లేదని, రోడ్ల పరిస్తితిని చూస్తేనే అర్ధమవుతుంది. ఇంకా గోదావరి జిల్లాల్లో రోడ్లు పరిస్తితి చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోడ్ల పరిస్తితి చాలా దారుణంగా ఉంది.
అయితే ఇప్పుడు వానాకాలం తగ్గింది...ఇకనుంచైనా ప్రజాప్రతినిధులు కాస్త రోడ్లని బాగు చేస్తే...వచ్చే సంక్రాంతికి రోడ్లు కాస్త బాగుంటాయి. లేదంటే ఇప్పటివరకు మన రోడ్ల గురించి మనకే తెలిసింది...కానీ సంక్రాంతి తర్వాత పక్క రాష్ట్రాల ప్రజలకు...విదేశాల్లో ఉన్న బంధువులకు తెలుస్తోంది. పైగా రోడ్లపై గుంతల వల్ల ఇబ్బంది పడుతూ...స్థానిక ఎమ్మెల్యేలని తిట్టుకునే పరిస్తితి ఉంటుంది. అసలు ఇదేంటి మీ ఎమ్మెల్యే రోడ్లు కూడా వేయించలేరని అనే పరిస్తితి వస్తుంది. కాబట్టి ఈ నెల రోజుల్లోనైనా రోడ్లని బాగు చేస్తే బాగుంటుందని గోదావరి జిల్లాల జనం కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: