ఓమిక్రాన్ : గుబులు పుట్టించే మరో వార్త?

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ తో అల్లాడిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో మళ్లీ భయం గుప్పెట్లో కి వెళ్తున్నారూ. అయితే రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా వేరియంట్ తో తో పోల్చి చూస్తే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఎక్కువ ప్రమాదకారి అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. దీంతో మొన్నటివరకు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అనీ ఆంక్షలను  సడలించిన  దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.

దీంతో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేయడమే కాదు.. మళ్ళీ కరోనా నిర్ధారిత  పరీక్షలు చేయడంపై అన్ని దేశాలు అటు సిద్ధమయ్యాయి.అయితే ప్రపంచ దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో అందరిలో భయం పట్టుకుంది. ఇక ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఓమిక్రాన్ పేరెత్తితే చాలు భయపడి పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే మరో గుబులు పుట్టించే వార్త బయటకు వచ్చింది.

 ఓమిక్రాన్ వేరియంట్ కొత్త వెర్షన్ ను ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ కి వచ్చిన ఓ యాత్రికుడిలో ఓమిక్రాన్ కొత్త వెర్షన్ తో బాధపడుతున్నట్లు గుర్తించామని అక్కడ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ప్రపంచంలోనే మొదటిసారిగా ఓమిక్రాన్ కొత్త వర్షన్ ను అధికారికంగా ప్రకటిస్తున్నాము అంటూ ఆస్ట్రేలియా వైద్య శాఖ తెలిపింది. ఇక ఈ క్రమంలో కొత్త వర్షన్ అని చెప్పడంతో అటు ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: