తెలంగాణలో మరో ఉప ఎన్నిక...?

Gullapally Rajesh
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నంలో భాగంగా కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడం అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్ ఇవ్వడం అలాగే ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని నమ్మకం చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది బిజెపి నాయకులు ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేయడం ఆసక్తి రేపుతున్న అంశాలు.
ఈ నేపథ్యంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోసం భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలున్నాయని తమ పార్టీలోకి తీసుకుని వాళ్లకు నమ్మకం కలిగించేందుకు సిద్ధంగా ఉన్నారని అలాగే రాజీనామా చేసి రావాలని తెలంగాణలో ఉప ఎన్నిక తీసుకువచ్చి కచ్చితంగా గెలిపిస్తామని చెప్పారని అంటున్నారు.
గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకులతో మంచి సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సదరు నాయకుడు విషయంలో కాస్త భారతీయ జనతా పార్టీ చాలా ఆసక్తికరంగా ఉందని ఈ నేపథ్యంలోనే మంచి ఆఫర్ కూడా ఇచ్చారని ప్రభుత్వం ఏర్పాటు అయితే మాత్రం కచ్చితంగా కీలక మంత్రి పదవి ఇస్తామని లేదా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపించుకొని కేంద్రమంత్రిగా తీసుకుంటామని కూడా చెప్పారని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏవిధంగా మారబోతున్నాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: