వచ్చే ఏడాది మొదట్లో జగన్ సంచలనం...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం కాస్త ఇప్పుడు మంత్రులను కంగారు పెడుతోంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొంతమంది మంత్రులు ఇబ్బంది పెట్టటం అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల్లో కూడా లేకుండా కేవలం వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెట్టటం వంటివి కాస్త చిరాకుగా మారాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రుల్లో సమర్థవంతంగా పని చేయలేక పోయినా తెలుగుదేశం పార్టీలు గట్టిగా విమర్శించిన లేకపోయినా మాత్రం ఖచ్చితంగా వాతావరణం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
రాజకీయంగా జనసేన పార్టీ అలాగే భారతీయ జనతాపార్టీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యవహారాల మీద కాస్త సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంత్రులను రెండు పార్టీలు టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న మంత్రులు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విషయంలో వెనకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
అందుకే వచ్చే ఏడాది మొదట్లో ఖచ్చితంగా ముగ్గురు మంత్రులను గోదావరి జిల్లాల నుంచి జగన్ తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎవరు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకు రాలేకపోతున్నారు అలాగే విపక్షాల మీద విమర్శలు చేయలేక పోతున్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన సీరియస్ గా పెట్టే అవకాశం ఉందని ప్రజల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎంపీ లతో సఖ్యత లేకుండా ఉన్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకుండా ఆయన ఊరుకునే అవకాశమే లేదని అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: