ఇదంతా కాదంటున్న పవన్...?

Gullapally Rajesh
భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా పవన్ కళ్యాణ్ సమర్ధవంతంగా నిర్వహించ లేదు అనే మాట వాస్తవం. జనసేన పార్టీని ఎన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీ ప్రతి విషయంలో కూడా వెనక్కి తగ్గడంతో పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ఆదేశాలు రాక వెనక్కి తగ్గుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని విషయాల్లో సీరియస్ గా లేకపోతే అలాగే జనసేన పార్టీ నాయకులకు ధైర్యం కల్పించ లేకపోతే కార్యకర్తలలో నమ్మకం లేకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రతి అవకాశాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోంది అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నాయకులు కూడా రాష్ట్రం మీద దృష్టి పెట్టి కొన్ని కొన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు.
కానీ జనసేన పార్టీ విషయంలో మాత్రం అటువంటి పరిస్థితులు కనపడక పోవటంతో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణలో అవసరమైన భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను కానీ రాష్ట్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండేందుకు తాను ఏ విధంగా కూడా సుముఖంగా లేరని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టొద్దని ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నప్పుడు తాను వెనక్కు లాగడం  కరెక్ట్ కాదు అని అభిప్రాయపడుతున్నారనీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: