వ్యాక్సిన్ వేసుకోకపోతే కరెంట్ కట్.. షాకిచ్చిన అధికారులు?

praveen
ఇటీవలే వెలుగు లోకి వచ్చిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తోంది. భారత్ ను కూడా ఈ మహమ్మారి వైరస్ భయం వెంటాడుతోంది. అయితే రెండవ దశ కరోనా వైరస్ కారణంగా భారత్లో ఎంత విపత్కర పరిస్థితులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆక్సిజన్ కొరత కారణంగా ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. ఈ క్రమం లోనే మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఓమిక్రాన్ విషయంలో ఇప్పటికే ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

 ఇతర దేశాల నుంచి వస్తున్న వారిపై కఠిన ఆంక్షలను విధిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇటీవలి కాలంలో రోజు రోజుకి అందరిలో భయంపెరిగిపోతూనే ఉంది. అయితే ఓమిక్రాన్ వైరస్ కేసులు భారత్లో పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యం గా అధికారులు ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై కఠినం గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు అధికారులు.

 వ్యాక్సిన్ వేసుకోని వారి పై ఎన్నో ఆంక్షలను తీసుకు వస్తున్నారు.. ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో కూడా అధికారులు ప్రజల కు షాక్ ఇచ్చారు.. కరోనా వైరస్ కట్టడి లో భాగం గా సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోని వారి ఇళ్లకు అధి కారులు కరెంటు సరఫరా నిలిపి వేస్తున్నారు. జహీరాబాద్ మండలం శేఖ పూర్ లో మొత్తం 4284 మంది జనాభా ఉన్నారు. ఇక వారి లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన 2092 మంది ఉన్నారు. ఈ క్రమం లోనే వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా అనధికారికం గా రేషన్ నిలిపి వేశారు.  అంతే కాకుండా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారి ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: