ఓమిక్రాన్ పై కన్ఫ్యూజన్.. ఎందుకో తెలుసా?

praveen
కరోనా వైరస్ ఇక ఈ మహమ్మారి దాదాపు రెండేళ్ల నుంచి ప్రపంచ ప్రజానీకాన్ని భయం గుప్పెట్లో నెడుతూనే ఉంది. ప్రజలందరూ సమిష్టిగా పోరాడుతూ ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో ఒకానొక సమయంలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఊహించని రీతిలో మళ్లీ విజృంభిస్తుంది ఈ మహమ్మారి. రూపాంతరం చెందుతూ ప్రపంచ మానవాళికి ఊపిరి సలపకుండా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ ను ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నాయి.  ఇప్పుడు కొత్తగా ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్  వెలుగులోకి వచ్చింది.

 దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న విషయం కంటే  వైరస్ విషయంలో శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే జనాలను కన్ఫ్యూజన్ లో పడేసింది. ఇక ఇప్పుడు ఓమిక్రాన్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ ఐదురెట్లు ప్రమాదకరమైనది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇక అదే సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలు డెల్టా కంటే ఓమిక్రాన్   ప్రమాదకరమైనది అంటూ వాదనలు వినిపిస్తున్నారు.

కానీ మరికొంతమంది మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తూ జనాలను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. డెల్టా వేరియంట్ కంటే  ఓమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఆంటోని పౌచి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రారంభ నివేదికలను బట్టి ఇప్పటి వరకు ఓమిక్రాన్ వల్ల తీవ్ర లక్షణాలు ఎక్కడ బయట పడలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. డెల్టా వేరియంట్ తో పోల్చి చూస్తే స్వల్ప లక్షణాలు కలిగి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఓమిక్రాన్ గురించి అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరి కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: