షాకింగ్ : ఓమిక్రాన్ నుండి కోలుకున్నాడు.. అంతలోనే మళ్ళీ?

praveen
కరోనా వైరస్.. ఇది మానవాళికి అడుగడుగునా ముప్పు కలిగిస్తూనే ఉంది. మానవాళి మనుగడకే ప్రశ్నార్ధకం గా మారుస్తోంది. రూపాంతరం చెందుతూ వేగం గా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి ఇంకా దాహం తీరలేదు అన్నట్లు  గానే రూపాంతరం చెందుతూ అందరిని  మృత్యువు ఒడిలోకి చేరుస్తుంది. అయితే ఒకసారి కరోనా వైరస్ బారిన పడిన తర్వాత మళ్లీ కరోనా వైరస్ బారిన పడే అవకాశం లేదు అనీ అప్పట్లో టాక్ వినిపించినప్పటికీ అలాంటి వార్తలు నిజం కాదని జాగ్రత్తలు తీసుకోక పోతే మళ్లీ  వైరస్ బారిన పడే అవకాశం ఉందని శాస్త్ర వేత్తలు హెచ్చరించారు.

 అయితే ఇక ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ను డెల్టా వేరియంట్ తో పోల్చి చూస్తే ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటూ శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం లో ఉన్న వ్యాక్సిన్లు ఇక ఈ కొత్త వేరియంట్ పనిచేస్తాయా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఓమిక్రాన్ అత్యంత వేగం గా వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని తెలియజేసే విధంగా ఇక్కడ ఘటన వెలుగు లోకి వచ్చింది.

 దేశంలో తొలిసారి ఓమిక్రాన్ వేరియంట్ సోకిన ఇద్దరి లో ఒకరైన బెంగళూరు వైద్యుడు ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నాడు. కానీ అంతలోనే మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన అసోసియేషన్ లో ఉన్నాడు. అతనిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నుంచి జయించాడు అనుకునేలోపే మళ్లీ పాజిటివ్ రావడం  మాత్రం అటు వైద్య అధికారుల లో కూడా ఆందోళన రేపుతోంది. కాగా ఇప్పటి వరకు దేశంలో ఓమిక్రాన్ కేసులు బయట పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: