జగన్ ప్రత్యర్ధి ఇంకో ఛాన్స్ తీసుకుంటారా?

M N Amaleswara rao
పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేసే ప్రత్యర్ధులు ఎవరైనా సరే...వారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందనే చెప్పాలి. ఓడిపోయినా సరే వైఎస్సార్ ఫ్యామిలీపై ప్రత్యర్ధి అంటే...ఆయన అందరికీ తెలుస్తారు. అలా వైఎస్సార్ ప్రత్యర్ధిగా సతీశ్ రెడ్డి బాగా హైలైట్ అయ్యారు. ఎక్కువ పర్యాయాలు ఈయనే...వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేశారు. 1999 ఎన్నికల నుంచి ఆయన పులివెందులలో పోటీ చేస్తూ వస్తున్నారు.
1999, 2004,  2009 ఎన్నికల్లో సతీశ్ రెడ్డి...వైఎస్సార్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2011 ఉపఎన్నికల్లో ఈయన పోటీకి దిగలేదు. మళ్ళీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా జగన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అలా టీడీపీ తరుపున బరిలో దిగి...సతీశ్ ఓడిపోతూ వస్తున్నారు. అలా వరుసగా ఓడిపోతూ వస్తున్న సతీశ్...ఇప్పుడు టీడీపీలో లేరు. గత ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయన..రాజకీయాలకు దూరం జరిగారు. టీడీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.
ఇక సొంత వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ సతీశ్ ముందుకెళుతున్నారు...సతీశ్ సైడ్ అవ్వడంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌గా బీటెక్ రవిని నియమించారు. ఇప్పుడు ఆయనే పులివెందుల బాధ్యతలు చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రవినే జగన్‌పై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని సతీశ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
ఎందుకంటే ఆయనకు దశాబ్దాల పాటు టీడీపీతో అనుబంధం ఉంది. ఆ పార్టీ కోసం కష్టపడిన ఆయన...గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రావడంతోనే...మళ్ళీ రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీని వీడిన వెంటనే ఈయనకు వైసీపీలో చేరే అవకాశం కూడా ఉంది. కానీ సతీశ్ రెడ్డి అలా చేయలేదు...టీడీపీని మాత్రం వీడి..సొంత పనులు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఆయన టీడీపీలోకి వచ్చి పులివెందుల బరిలో దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వచ్చే ఎన్నికల ముందు సతీశ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి జగన్ ప్రత్యర్ధి రాజకీయాల్లో ఇంకో ఛాన్స్ తీసుకుంటారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: