కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

M N Amaleswara rao
నెల్లూరు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని, ఇక్కడ వేరే పార్టీలకు అంత సీన్ లేదని గట్టిగా చెప్పొచ్చు. నెల్లూరు ప్రజలు ఎక్కువగా వైఎస్సార్ ఫ్యామిలీ అభిమానులు అని చెప్పాల్సిన పని లేదు. అందుకే జిల్లాలో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అసలు గత ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ జిల్లాలో వైసీపీ హవా స్పష్టంగా కనబడుతోంది.
కాకపోతే కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం వల్ల కాస్త...ఆ పార్టీకి వ్యతిరేక వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. అలా అని వైసీపీ బలం తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. ఇంకా టీడీపీ కంటే మెరుగ్గానే వైసీపీ బలం ఉంది. అలా వైసీపీ హవా తగ్గని నియోజకవర్గాల్లో కావలి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే ఈ మూడు చోట్ల టీడీపీ బలాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. కావలి, ఉదయగిరి నియోజకవర్గాలని పక్కనబెడితే...కోవూరులో టీడీపీకి పట్టు ఉంది. కాకపోతే అది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..టీడీపీలో ఉన్నంత కాలమే..ఆ తర్వాత వైసీపీ వశమైంది.  ఇప్పటికీ అక్కడ నల్లపురెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈయన్ని ఢీకొట్టి ఇక్కడ టీడీపీ గెలవడం చాలా కష్టం.
ఇక ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. 2004, 2009, 2012, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లో ఓడిపోయినా సరే వెంటనే పికప్ అయ్యి...2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక గెలిచి రెండున్నర ఏళ్ళు అయినా సరే...ఉదయగిరిలో మేకపాటికి తిరుగులేకుండా ఉంది. అటు కావలిలో సైతం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి..గత రెండు ఎన్నికల నుంచి సత్తా చాటుతున్నారు. పైగా ఇక్కడ బలంగా ఉన్న బీదా మస్తాన్ రావు...వైసీపీలోకి రావడం బాగా అడ్వాంటేజ్ అయింది. మొత్తానికైతే ఈ మూడు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్పీడ్ మాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: