పవన్ చంద్రబాబులలో ముఖ్యమంత్రి ఎవరు... ?

Satya
పవన్ కళ్యాణ్ సినిమా హీరో కమ్ పొలిటీషియన్. చంద్రబాబు రాజకీయమే శ్వాసగా నాలుగు దశాబ్దాల నుంచి ఉంచారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అందులో రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు.
ఇక మరో మూడు సార్లు విపక్ష నేతగా ఉన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని, సీఎం కావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన ప్రజలకు నేరుగా హామీలు ఇస్తున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అన్నది ముందే చెప్పేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం. ఈ విషయంలో రెండవ మాటకు తావులేదు.
కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలుగుతుందా అన్నదే చర్చ. ఇక టీడీపీ కూడా పొత్తుల కోసం చూస్తోంది. జనసేనతో కలసి ఏపీలో అధికారంలోకి రావాలని టీడీపీ ఆలోచిస్తోంది. దాంతో జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందా, కుదిరితే ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి. ఎవరు సీఎం అవుతారు అన్నది చర్చగా ఉంది.
జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తాను సీఎం కావాలని అనుకుంటున్నారు. ఆయన కూడా ఎక్కడా తగ్గడంలేదు. తాను సీఎం అయితే ఏం చేస్తానో ప్రతీ సభలో చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా సీఎం కావాలన్న తన ఆకాంక్షను పవన్ బయటపెట్టుకున్నారు. ఇపుడు పొత్తుల పేరిట చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించి పవన్ ఖాళీగా ఉంటారా అన్నది చర్చ.
ఆయన అలా చేస్తే జనసైనికులు ఊరుకుంటారా అన్నది కూడా ఆలోచించాలి. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి చెరి సగం పోటీ చేసి అధికారం దక్కితే చెరి సగం పాలన చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి పవన్ చంద్రబాబులలో ఎవరు సీఎం అవుతారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: