మోడీ సీరియస్ గా ఉన్నారా...?

Gullapally Rajesh
దాదాపుగా ఏడాది నుంచి కొంత మంది కేంద్ర మంత్రులు ప్రభుత్వ వ్యవహారాల మీద అదేవిధంగా సొంత రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల మీద పట్టు కోల్పోవడం అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్త నేతలను ముందుకు నడిపించే విషయంలో వెనకడుగు వేయడం అనేది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో కొన్ని అంశాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇబ్బందికర వాతావరణం ఎదురుకావడం అనేది ప్రధానమంత్రికి కాస్త ఇబ్బందిగా మారిందని అదే విధంగా కేంద్ర నాయకత్వానికి కూడా కొంతమంది నాయకులు ప్రధాన సమస్యగా మారారని వార్తలు వస్తున్నాయి.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అంశాన్ని కూడా వదలక పోవడం అదేవిధంగా రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏకం కావడం అనేది ప్రధాన మంత్రిని ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్రంలో బలంగా కనబడుతున్నా సరే కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం పూర్తిగా కాకపోవడం ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొంతమంది నాయకుల వైఖరి కారణంగా పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా లేకపోవడం అనేది కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి.
త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు కూడా రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులు అదే విధంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి ముఖ్యమంత్రులు అన్ని విధాలుగా కష్టపడాల్సి ఉండగా కొంతమంది ముఖ్యమంత్రి పదవి విషయంలో నమ్మకం లేకపోవడంతో సమర్థవంతంగా పని చేయడం లేదని అలాగే కొంత మంది కేంద్ర మంత్రులు కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి పదవి ఆశించడం ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు. ప్రధానంగా రెండు కీలక రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఒక కేంద్ర మంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలలో ఆశిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ముందుకు రాబోతుంది ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: