శ్రీశైలంలో శిల్పా హవా...బుడ్డా సెట్ చేస్తారా..?

VUYYURU SUBHASH
కర్నూలు జిల్లా అంటే వైసీపీ అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో వైసీపీ వైపే ప్రజలు ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు వైసీపీని ఏ విధంగా ఆదరిస్తున్నారో తెలిసిందే. అసలు గత ఎన్నికల్లో అయితే మొత్తం సీట్లలో వైసీపీనే గెలిపించారు. అయితే ఇలా జిల్లా మొత్తం వైసీపీ వశమైపోయింది. కానీ నిదానంగా జిల్లాలో రాజకీయం మారుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూడా పుంజుకుంటుంది. అలా అని మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ బలం తగ్గలేదు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బాగా స్ట్రాంగ్‌గా ఉంది.
అలా శ్రీశైలం నియోజకవర్గంలో కూడా వైసీపీ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అసలు మొదట నుంచి శ్రీశైలం టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం కాదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతూ వస్తుంది. అభ్యర్ధులని మార్చిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. 2009లో టీడీపీ తరుపున బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి...కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఓడిపోయారు.
ఇక 2014లో సీన్ రివర్స్...ఏరాసు టీడీపీ నుంచి పోటీ చేస్తే...బుడ్డా వైసీపీ నుంచి పోటీ చేశారు. విజయం బుడ్డాని వరించింది. అయితే ఆ తర్వాత బుడ్డా టీడీపీలోకి వచ్చేశారు. 2019 ఎన్నికల్లో మొదట బుడ్డా పోటీ చేయకూడదని అనుకున్నారు...కానీ చంద్రబాబు ఎలాగోలా ఒప్పించి...బుడ్డాని బరిలో దింపారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన శిల్పా చక్రపాణి రెడ్డి...వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పటికీ శ్రీశైలంలో శిల్పా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రజలకు అండగా ఉండటంలో, వారికి పనులు చేసి పెట్టడంలో ముందున్నారు. అందుకే శ్రీశైలంలో వైసీపీ హవా ఎక్కడా తగ్గలేదు. అయితే టీడీపీ తరుపున బుడ్డా రాజశేఖర్ రెడ్డి బాగా దూకుడుగా మాత్రం పనిచేయడం లేదు. దీని వల్ల శ్రీశైలంలో టీడీపీ ఇంకా పికప్ అవ్వలేకపోతుంది. నెక్స్ట్ ఎన్నికల వరకు ఇదే పరిస్తితి ఉంటే...శ్రీశైలంలో టీడీపీ గెలవడం కష్టం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: