వలస ఓ వ్యసనం ఇదే నయా రాజకీయం

RATNA KISHORE
తెలుగు రాజకీయాలు తమిళ రాజకీయాలు అంటూ ఏమీ ఉండవు. ఉన్నవి కొన్ని అలా పడిఉంటాయి అని అనుకోవడం అవివేకం.మన దేశాన కొన్ని రంగులు మార్చుకున్నంత మాత్రాన రాజకీయం మారిపోతుంది అని అనుకోవడం కూడా అవివేకం. అవివేకాన్ని సంస్కరించిన వారికి ఇక్కడ నూకలు ఉన్నాయో లేవో తెలియదు. ఆ తరహాలో లోకుల ఆలోచనలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కనుక ఆ ఇద్దరూ త్వరలో పార్టీ మారితే జగన్ కోటరీలో పెను మార్పులు వస్తాయి. ఇంతటి స్వామి భక్తిని ప్రసాదించిన ప్రజా స్వామ్య శక్తికి మరియు సంబంధిత యుక్తికి కొడాలి నానీ కానీ వల్లభనేని వంశీ కానీ కట్టు బానిసలుగా ఎందుకు మారిపోయారో కూడా అర్థం లేదా అవగతం తప్పక అవుతుంది. ఓ డ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వీరిద్దరూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రాజీలేని వలస జీవులు.


వీళ్లలానే తమ్మినేని ధర్మాన ఇంకా ఇంకొందరు కూడా రాజీ పడని పడలేని  పడబోని పడనివ్వని వలస జీవులు అని కూడా రాయొచ్చు. తప్పేం కాదు. అసలు వైసీపీ అన్నదే వలస పక్షుల పార్టీ లేదా వలస జీవుల పార్టీ. కనుక ఈ జీవుల మనుగడ అన్నది తెలుగుదేశం నిర్ణయానుసారం జరుగుతుందో లేదా తెలుగుదేశం ఏజెంట్ల నిర్ణయానుసారం జరుగుతుందో అన్నది ముందున్న కాలమే నిర్ణయించాలి. లేదా తెలుగుదేశం చేసినా లేదా చేయాల్సిన తప్పుల ఆధారంగా జరుగుతుందో కూడా తెలియాల్సి ఉంది. ఇంతటి ఘనమయిన రాజకీయాలకు ప్రజాప్రతినిధులు ఉన్నంత వరకూ మనకు మంచి జరుగును. మంచి లేదా మంచి అనుకునే పరిణామాలకు దగ్గరగా మనం జీవితం ఉండును.. ను ను ను.. నేను మరియు మీరు అనుకును మార్గం ఒకటి తప్పక  ఉండెను..లేదా ఉండును.
పాలన ఏదయినా పాలకులు ఏమయినా కానీ మన రాజకీయాల్లో తిరుగులేని నైజం ఉన్నా లేకున్నా కూడా కొన్ని జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ఎదురులేని మనిషి, మడమ తిప్పని మనిషి వగైరా వగైరా పదాలు మనం పలుకుబడికి తూగేవే కానీ పెద్దల పలుకుబడిని పెంచేవి అవునో కాదో చెప్పలేం కొన్నిసార్లు. తెలుగు దేశం నుంచి వలస పోయిన నాయకులు వైసీపీలో చక్రం తిప్పుతా ఉంటే, వైసీపీ నుంచి ఆ రోజు టీడీపీకి పోయిన నాయకులు  పదవులు పొంది హాయిగా రాజకీయం నడిపిన వైనం గత కాల కథ అని అందరికీ విధితమే! మనం ఏం చెప్పినా చెప్పకున్నా పార్టీని నమ్ముకుని కడదాకా రాజకీయం చేయడంలో అర్థం లేదు అన్నది ఇప్పటి వాదన. ఒకే పార్టీని అని రాయాలి. అవును.. ఎందుకంటే రాజకీయం వలస పక్షులతోనే నిండిపోయి ఉంటుంది. గెలిచినవారిది రాజ్యం కనుక వారితోనే ఉండడంలో తప్పు కన్నా ఒప్పులు ఎక్కువ ఉన్నాయి అని మనం అనుకోవడం ఓ విధి. కాల కూటం లాంటి ఈ రాజకీయంను మనం శాసించలేం కనీసం మార్చలేం కూడా! కనుక మనం చూస్తూ ఉంటే జగన్ కోటరీలో వచ్చే మార్పులు విస్మయ భ్రాంతిని కలిగిస్తాయి. సందేహాస్పద పరిణామాలకు తావిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లంతా ఎగిరిపోయి ఎక్కడో వాలిపోయి  స్వర్గ ధామ నిర్మాణాలకు వనరులు వెతుక్కుంటే ఈ జగన్ కానీ ఆ చంద్రబాబు కానీ ఏం చేస్తారని?
- రత్నకిశోర్ శంభుమహంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: