రాజగోపాల్ కమలం వైపు చూస్తున్నారా?

M N Amaleswara rao
కోమటిరెడ్డి బ్రదర్స్ అనగానే కాంగ్రెస్ పార్టీ ఠక్కున గుర్తొచ్చేస్తుంది. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ని, కాంగ్రెస్ పార్టీని వేరు వేరుగా చూడటానికి లేదు. అలాంటిది ఈ మధ్య కోమటిరెడ్డి బ్రదర్స్...కాంగ్రెస్‌కు దూరంగానే రాజకీయం చేస్తున్నారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్..పార్టీకి దూరం జరిగారు. ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...కాంగ్రెస్‌కు దూరం జరిగారు. అలాగే పరిస్తితులని బట్టి బీజేపీ చేరిపోతానని కూడా చెప్పారు.
ఆ తర్వాత పి‌సి‌సి పదవి కోసం ట్రై చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిరాశే ఎదురైంది. రేవంత్ రెడ్డికి పి‌సి‌సి అధ్యక్ష పదవి ఇవ్వడంతో...వెంకటరెడ్డి ఏ విధంగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. అలాగే మళ్ళీ గాంధీ భవన్ గడప తొక్కనని శపథం చేశారు. అలా వెంకటరెడ్డి కాంగ్రెస్‌తో సంబంధం లేనట్లు రాజకీయాలు నడిపారు. కానీ ఈ మధ్య అధిష్టానం బుజ్జగించడం...సీనియర్ నేత వి. హనుమంతరావు...కోమటిరెడ్డిని సముదాయించడంతో...కాస్త పరిస్తితి మారింది.
అందుకే ఈ మధ్య ధాన్యం విషయంలో దీక్ష చేసిన రేవంత్‌కు కోమటిరెడ్డి మద్ధతు ఇచ్చారు. దీక్ష దగ్గరకు వచ్చి మరీ....రేవంత్‌ పక్కన కూర్చుని మద్ధతు తెలిపారు. దీంతో వెంకటరెడ్డి ఇంకా చల్లబడ్డారని, మళ్ళీ ఆయన కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పనిచేస్తారని అర్ధమైంది. కాకపోతే అన్న వెంకటరెడ్డి యాక్టివ్ అయినా సరే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంకా పార్టీలో యాక్టివ్ కాలేదు. ఇంకా ఆయన కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
అసలు ఆయన రాజకీయం ఏంటో ఇంకా అర్ధం కావడం లేదు. అసలు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక బీజేపీ వైపు వెళ్లిపోతారనేది తెలియడం లేదు. అయితే రాజగోపాల్ ఇప్పటిలో క్లారిటీ ఇచ్చేలా లేరు. నెక్స్ట్ ఎన్నికల ముందు పరిస్తితులని బట్టి ఆయన నిర్ణయం తీసుకుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: