నో డౌట్: రాపాకకు ఇంకా ఛాన్స్ లేనట్లే?

M N Amaleswara rao
రాజకీయాల్లో నేతల జంపింగులు అనేవి సహజమే...అవకాశాలని బట్టి, అవసరాలని బట్టి నేతలు పార్టీలు మారిపోతారు. కాకపోతే ఇక్కడ గతంలో మాదిరిగా జంపింగ్ నాయకులని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. ముఖ్యంగా పదవులు ఉన్నవారు జంప్ అయితే..నెక్స్ట్ ఎన్నికల్లో వారిని ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నారు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసి...గత ఎన్నికల్లో టీడీపీ తరుపున నిలబడ్డారు. కానీ వారిని ప్రజలు ఎలా చిత్తుగా ఓడించారో అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందని చెప్పి...నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే సైతం జంప్ చేశారు. మరి వీరి పరిస్తితి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలని ఎంతవరకు ఆదరిస్తారనేది చెప్పలేకుండా ఉన్నాం. ప్రస్తుతానికైతే వారు అధికార పార్టీ వైపు ఉన్నారో కాబట్టి...పెద్దగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడం లేదు. కానీ పైకి ఎలాంటి ఇబ్బందీ లేనట్లు ఉన్నా సరే..క్షేత్ర స్థాయిలో మాత్రం బాగా జంపింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన రాపాక వరప్రసాద్‌కు బాగా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు రాపాక...2009లో కాంగ్రెస్ నుంచి రాజోలు బరిలో గెలిచారు. 2014లో మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి జనసేన తరుపున పోటీ చేసి..వైసీపీ, టీడీపీ అభ్యర్ధులని ఓడించారు.
అలా జనసేన నుంచి గెలిచిన రాపాక..నెక్స్ట్ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. పైగా అధికార పార్టీలోకి వెళ్ళిన ఈయన రాజోలు ప్రజలకు చేసింది ఏమి లేదు. అభివృద్ధి శూన్యం..దీంతో రాజోలులో రాపాకపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అటు జనసేన కార్యకర్తలు...రాపాకని ఓడించాలని చూస్తున్నారు. నెక్స్ట్ గానీ రాపాకకు వైసీపీ టిక్కెట్ ఇస్తే మాత్రం రాజోలు ప్రజలు మళ్ళీ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అసలు వైసీపీలో ఈయనకు టిక్కెట్ దొరుకుతుందో లేదో కూడా డౌటే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: