ఏపీలో ఆ జంపింగ్ లీడ‌ర్‌ను మించిన అదృష్టం ఎవ‌రికి లేదే...!

VUYYURU SUBHASH
ఇప్పుడు మ‌న దేశంలో అంతా వ‌ల‌స‌ల రాజ‌కీయ‌మే న‌డుస్తోంది. ఎవ‌రికి వారు త‌మ స్వార్థ రాజ‌కీయ విధానాల కోసం రోజుకో పార్టీ.. పూట‌కో కండువా మార్చేస్తున్నారు. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ నేత‌లు భార‌త దేశంలోనే టాప్ ప్లేసులోకి వెళ్లిపోయారు. 2014 త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఈ వ‌ల‌స‌ల రాజ‌కీయానికి ఊతం ఇవ్వ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నుంచి భారీగా వ‌ల‌స‌ల నేత‌ల‌ను త‌మ పార్టీల్లో చేర్చుకున్నారు. పైగా వీరు ఒక అడుగు ముందుకు వేసి ఇత‌ర పార్టీల లో గెలిచిన ఎమ్మెల్యేల‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవ‌డంతో పాటు వారికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టారు.

అయితే ఈ విష‌యంలో జ‌గ‌న్ మాత్రం తాను ఇత‌ర పార్టీల్లో గెలిచిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోన‌ని ముందు నుంచే చెపుతూ వ‌చ్చారు. ఒక పార్టీ పై గెలిచి.. త‌మ పార్టీలోకి వ‌స్తే ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి రావాల‌ని ఆయ‌న పెట్టిన కండీష‌న్ నే ఇప్ప‌ట‌కీ ఫాలో అవుతున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ నేత ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడు జంపింగ్ లీడ‌ర్ల‌లో ఆయ‌న‌కు ప‌ట్టిన అదృష్టం ఎవ్వ‌రికి పట్టలేదనే చెప్పాలి.

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్రాపురం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంట‌నే ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆ వెంట‌నే జ‌గ‌న్ ఆయ‌న‌కు అమ‌లాపురం పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. ఈ రెండు ప‌ద‌వులు ఉండ‌గానే ఆయ‌న‌కు ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చారు.

ఇలా త‌క్కువ టైంలో పార్టీ మారిన వెంట‌నే ఆయ‌న‌కు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప‌ద‌వులు వ‌చ్చాయి. దీంతో వైసీపీ లోకి వ‌చ్చిన జంపింగ్ లీడ‌ర్ల‌లో తోట‌కు మించిన అదృష్టవంతులు  ఎవ్వ‌రూ లేర‌ని ఆ పార్టీ నేత‌లు గుస‌గుస లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: