బాల‌య్య ' అఖండ ' ను ఎత్తేస్తోన్న వైసీపీ టాప్ లీడ‌ర్లు..!

VUYYURU SUBHASH
యువరత్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ‌ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అఖండ జ్యోతి లా గర్జిస్తోంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో కచ్చితంగా ఆ అంచనాలను అఖండ‌ అందుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా - లెజెండ్ రెండు సినిమాల ను మించి అఖండ ఉందని టాక్ వచ్చేసింది. ఈ క్రమంలోనే అఖండ కేవలం రెండు రోజులకే 50 కోట్ల వసూళ్లు సాధించింది. అఖండ కు టోట‌ల్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా స‌పోర్ట్ చేస్తోంది. అంద‌రు అగ్ర హీరోలు కూడా సోష‌ల్ మీడియాలో అఖండ కు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. మ‌రో వైపు అంద‌రు అగ్ర హీరోల అభిమానులు కూడా ఈ క‌ష్ట‌కాలంలో సినిమా గెల‌వాల‌ని కోరుకుంటూ అఖండ ను స‌పోర్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అఖండ కు టీడీపీ నేత‌ల నుంచి ఎలాగూ ప్ర‌శంస‌లు ఉంటాయి. అయితే అనూహ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేత‌లు కూడా అఖండ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిన్న విజ‌య‌వాడ వైసీపీ నేత పీవీపీ ( పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ ) అఖండ సినిమా చూసి ఆకాశానికి ఎత్తేశారు. అఖండ అద్భుతంగా ఉంద‌ని .. బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించార‌ని మెచ్చుకున్నారు. ఇక పీవీపీ నిర్మాత కూడా అన్న విష‌యం తెలిసిందే.

ఇక వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు సైతం అఖండ చూసి సూప‌ర్ అంటూ మెచ్చుకున్నారు. కొంద‌రు ఫెయిడ్ జ‌ర్న‌లిస్టులు సినిమాలో ఫైట్లు ఎక్కువ అయ్యాయ‌ని చెపుతున్నారు అని.. అయినా అఖండ అదిరిపోయింద‌ని.. సినిమా సూప‌ర్ మాస్ సినిమా అని మెచ్చుకున్నారు. ఇక బాల‌య్య తాండ‌వం ఆడేశార‌ని.. ప్ర‌తి హిందూ వాది ఈ సినిమా ఖ‌చ్చితంగా చూడాల‌ని మెచ్చుకున్నారు. ఏదేమైనా వైసీపీ వాళ్లు కూడా సినిమాను మెచ్చుకోవ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: