ఆ పాపం.. బాబుదేనట.. నిజమేనా..?

Chakravarthi Kalyan
కొన్ని రోజుల క్రితం రాయల సీమను వరదలు ముంచెత్తాయి.. కడప జిల్లాలో ఏకంగా అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. దీని కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ వరదలపై రాజకీయం మొదలైంది. వరదలకు మీరు కారణం అంటే మీరు కారణం అని అధికార విపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు రిపేర్ చేయించలేదని.. విపక్ష నేత చంద్రబాబు విమర్శించారు.

ప్రాజక్టుకు మూడు గేట్లు బాగు చేయించని వాడు.. మూడు రాజధానులు ఏం కడతాడు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యంపై న్యాయవిచారణ ఎందుకు జరిపించడం లేదని చంద్రబాబు మండిపడుతున్నారు. అయితే.. చంద్రబాబు విమర్శలను వైసీపీ తిప్పికొడుతోంది. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబువి దొంగ ఏడుపులు..చిల్లర రాజకీయాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అంటున్నారు. అసలు  చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. చంద్రబాబు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు.

చివరకు ప్రకృతి విపత్తును కూడా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా చంద్రబాబు విమర్శిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అంతే కాదు.. ఈ విషయంలో కేంద్ర మంత్రి ఏదైనా మాట్లాడొచ్చా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు.  సోమశిలకు గత 140 ఏళ్లలో ఇంత వరద ఎప్పుడూ రాలేదని.. అసలు  అన్నమయ్య కెపాసిటీ 2 లక్షల 17 వేల క్యూసెక్కులు మాత్రమేనని గుర్తు చేశారు. అయితే.. కేవలం గంటల వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని దీనికి ఎవరు ఏం చేస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.


అసలు  గేట్ల మరమ్మతులపై చంద్రబాబు హయాంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అన్నమయ్య రిజర్వాయర్‌కు ఇంకో స్పిల్‌వే కట్టమని డ్యామ్‌ సెప్టీ వాళ్లు రిపోర్టు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో జరిగిన విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబే కారణమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: