ఎంద‌రో సీఎంల‌కు న‌మ్మిన బంటు రోశ‌య్య‌..!

VUYYURU SUBHASH
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ రోజు ఉదయం మృతి చెందారు. రాజకీయ చతురతకు పెట్టింది పేరు రోశ‌య్య‌. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా ఉంటూ వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.  రోశ‌య్య‌ ఎవరికీ అయినా మాట ఇస్తే ఆ మాట తప్పరు అన్న పేరు ఆయనకు ఉంది.  ఈరోజు ఉదయం ఆయనకు అకస్మాత్తుగా లో బిపి రావడంతో పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్ లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే రోశయ్య తుదిశ్వాసవిడిచారు. ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు. గుంటూరు జిల్లాలోని వేమూరు లో 4 జూలై  , 1933 లో ఆయ‌న జన్మించారు. ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం నాడు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నాడు ఆయ‌న ముఖ్య‌మంత్రి గా చాలా బాధా త‌ప్త హృద‌యంతో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.

ఎంతోమంది ముఖ్యమంత్రులకు ఆయ‌న నమ్మినబంటుగా ఉండేవారు. రోశ‌య్య నేద‌రు మిల్లి జనార్ధనరెడ్డి - కోట్ల విజయభాస్కర్ రెడ్డి - వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అత్యంత నమ్మకంగా ఉన్నారు. రోశ‌య్య చీరాల నుంచే రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ గా కూడా ప‌నిచేశారు. మ‌ధ్య‌లో ఆయ‌న లోక్‌స‌భ కు కూడా ఎంపిక‌య్యారు.

ఆయ‌న ఏ ప‌ద‌వి చేప‌ట్టినా కూడా ఆ ప‌ద‌వి వ‌న్నె తెచ్చార‌న్న పేరు ఉంది. రోశ‌య్య వివాద ర‌హితుడి గా ఉండే వారు. ఆయ‌న ఏనాడు కాంట్ర‌వ‌ర్సీ కి వెళ్లే వారు కాదు. అసెంబ్లీలో మంచి రాజ‌కీయ చాణుక్యంతో ఉండే వార‌నే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారు కూడా ఆయ‌న్ను మెచ్చుకునే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: