ఔరా.... వరద వచ్చింది... రెండు వందల కోట్లు తెచ్చింది


ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వరుస తుఫాన్ లు, వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రాయల సీమ తో పాటు నెల్లురు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వరద నష్టం ఎంత  ఉంటుందనేది ఇప్పుడిప్పుడే లేక్కతేలదు. కంటి ముందు కనిపించిందల్లా  కొట్టుకుపోయిన గట్టలు, తెగిన చెరువులు, నీట మునిగినపొలాలే. కనిపించని నష్టం చాలా ఉంటుంది. క్షేత్ర స్థాయి పరిశీలన జరిగితే వాసత మాత్రమే వివరాలు వెలుగోలోకి వస్తాయి.
నెల్లూరు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండో దఫా  పర్యటించారు. వరద బాధితులతో సంభాషించారు. మీకు వరద సాయం అందిందా ?అని అడిగారు.ఎవరికైనా అందక పోతే రెండు రోజుల్లో గ్రామ సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి సూచించారు. అదే సమయంలో విపత్తులను ఎదుర్కోవడంలో చొరవ చూపిన కలెక్టర్, ఇతర అధికారుల పై ప్రశంసల జల్లు కురిపించారు. వరదలు వచ్చిన వెంటనే తాను పర్యటిస్తే సాయం అందడంలో ఆలస్యమవుతుందనే తాను, అందరికీ పరిహారం అందజేశాక మీ ముందుకు వచ్చానని  తనను కలసిన అక్క చెల్లేమ్మలకు తెలిపారు. అంత వరకూ బాగానే ఉంది.
నెల్లూరు జిల్లాకు మణిహారం, జీనవాడి పెన్నా నది. ఈ నది పై బ్యారేజి నిర్మాణం పూర్తయింది. దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో అదికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నారు.  తమ ప్రాంతం వాసే ఇరిగేషన్ శాఖ  మంత్రిగా ఉండటంలో  పొర్లు కట్టల పటిష్టతకు నిధులు విడుదల అవుతాయని జిల్లావాసులు భావించారు.  అనీల్ కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వికరించి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా నిధులు మంజూరు ఆమడ దూరంలో ఉండి పోయింది.
అదే విధంగా సోమశిల డ్యాం. ఆసియాలోనే అతి పెద్దఎర్త్ డ్యాం. ఈ డ్యాంకు  ప్రతి ఏడాది ఎగువ ప్రాంతల నుంచి కూడా నీరు వచ్చి చేరుతుంది. ఈ డ్యాం నిండితే... అక్కడ నుంచి కండలేరు రిజర్వాయర్ కు, ఆ పై తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి తెలుగు గంగ ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. ఈ జలాశయ యాప్రాన్ నిర్మాణం కూడా  చాలా అవస్యకతను సంతరించుకున్న అంశం.  కారణాలు ఏవైనా ఈ ప్రాధాన్యత గల నిర్మాణపు పనులకు నిధులు విడుదల కాలేదు. ఫలితంగా నష్టం జరిగింది.
తాజా గా వచ్చిన వరదలతో  ఈ రెండింటి వల్ల  నెల్లూరు జల్లాకు అపార నష్టం సంభవించింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పెన్నా నది పొర్లు కట్టలకు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే విదంగా సోమశిల జలాశయం యాప్రాన్ నిర్మాణానికి  మరో నూటఇరవై కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. అంతే కాదు  జనవరి పండుగల తరువాత తానే స్వయంగా వచ్చి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానని, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ప్రకటించారు.  ఔరా... వదలు వస్తేనే నిధులు మంజూరవుతాయా ? అని నెల్లురు జిల్లా జనం ముక్కున వేలేసుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: