ఎం.పి. యాక్షన్... సెంటర్ రియాక్షన్ ... భలే ఉందబ్బా

 నిత్యం ఏదో విధంగా ప్రసార మాధ్యమాలలో ఉండే వ్యక్తి ఆయన. పైగా పార్లమెంట్ సభ్యుడు. ఇంకేముందు ఆయన చుట్టా  ఎప్పుడూ మీడియా ప్రతినిధులుంటారు. వారికి  నిత్యం వార్తలుంటాయి. ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖరాశారు. దీంతో కేంద్రం అలెర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు తాకీదు పంపింది....ఆ ఎంపి ఎవరో చప్పనక్కర లేదనుకుంటా ....
పార్లమెంట్ సభ్యులకు, ఆంధ్ర ప్రదేశ్ వాసులకు  పరిచయం అక్కర లేని వ్యక్తి. ఢిల్లీ తెలుగు మీడియా కు అత్యంత మిత్రుడు. ఆయన ముద్దు పేరు ఆర్ ఆర్ ఆర్... అదే నండీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎంపి రఘురామ కృష్ణం రాజు. ఆయన ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ లేఖాస్త్రాలు సంధించడం  అలవాటుగా చేసుకున్నారు. ఆయన ఏ లేఖ రాసినా కూడా దానిని ప్రభుత్వానికి పంపడం కంటే ముందుగా మీడియా కు అందజేస్తారు.  ఆ తరువాతే సంబంధింత యంత్రాగానికి పంపుతారు. ఇది చాలాకాలంగా జరుగుతున్న ప్రహసనం.
 ఆయన అంతకు మందెప్పుడో  కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆ శాఖఅధికారులు దానిని యధావిధిగా పక్కన పెట్టేశారు.  ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జురుగుతున్న నేపథ్యం ఆయనకు  కేంద్ర మహీళా , శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఇరానీ ఎదురయ్యారు. దీంతో సదరు ఎం.పి తాను రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. ఆమె వెంటనే తన అధికారులకు మౌఖికంగా అదేశాలు జారీ చేసేశారు. వెంటనే రాత పూర్వక ఆదేశాలు  దేశంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లాయి.  
మహిళా శిశు సంక్షేమ  శాఖ కార్యదర్శి శ్రీవాత్సవ భారత్ లోని అన్ని కార్యాలయాలకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పేర్లు మార్చడం తగదని ఆ  లేఖ లో పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం అములు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకాన్ని మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కోంటూ ఇక పై అలా చేయడం తగదని తెలిపారు. ఐసిడిఎస్ పథకాలన్నీ కూడా  కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పేర్లతోనే ఉండాలని సూచించారు.
కాగా ఎంపి రఘురామ కృష్ణం రాజు అనుచరులు, స్నేహితులు మాత్రం ఇది  వై,ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తమ విజయంగా పేర్కోంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అమలవుతున్న జగనన్న పోషణ, జగనన్న పాలు  తదితర పథకాల పేర్లు ఇక నుంచి మారుతాయని వారు భావిస్తున్నారు. కాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: