ఎన్నో ఆశ‌ల‌తో వైసీపీలోకి.. ఆ వార‌సుడి ఫ్యూచ‌ర్ చీక‌టేనా...?

VUYYURU SUBHASH
ఏపీలో వారసత్వ రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు కూడా త‌మ వార‌సు ల‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి స‌క్సెస్‌ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు తమ వారసులను తీసుకు వచ్చారు. గత ఎన్నికల్లోనే చాలామంది వారసులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో టీడీపీ నుంచి ఎక్కువ మంది ... వైసీపీ నుంచి తక్కువ మంది వారసులు మాత్రమే ఎన్నికల బరిలోకి దిగారు. టిడిపి నుంచి పోటీ చేసిన వారసుల్లో రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవాని మినహా అందరూ ఓడిపోయారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రి సీనియర్ నేత వారసుడు భవిష్యత్తు ఎలా ఉంటుంద‌న్న దానిపైనే కాస్త సస్పెన్స్ నెలకొంది. ఆ మాజీమంత్రి ఎవరో కాదు సిద్ధా రాఘవరావు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఐదేళ్లు మంత్రిగా ఉన్న ఆయన గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన గ్రానైట్ వ్యాపారాలపై దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో సిద్ధా రాఘవరావు ఆయన తనయుడు సుధీర్ బాబు ఇద్దరూ కలిసి వైసీపీలోకి వెళ్లిపోయారు.

అయితే ఇప్పుడు రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. వైసీపీ నుంచి జిల్లాలో పోటీ చేసేందుకు ఎక్కడ సీట్లు ఖాళీ లేవు. గతంలో శిద్ధా ఎమ్మెల్యేగా ఉన్నా దర్శి వైసీపీ లో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. వారిని కాదని సిద్ధా వారసుడు సుధీర్ బాబుకు సీటు ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వీరికి స్థానమే లేదు.

ఈ నేపథ్యంలో సుధీర్ బాబు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే.. వైసిపి నుంచి ఆ ఛాన్స్ కనుచూపుమేరలో కూడా కనపడటం లేదు. సిద్ధాకు టిడిపిలో దారులు తెరిచే ఉన్నాయని అంటున్నారు. మరి ఈ తండ్రి కుమారుల రాజకీయ భవితవ్యం ఎలా ? ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: