బాబు అక్క‌డ పార్టీకి దిక్కు ఎవ‌రు..!

VUYYURU SUBHASH
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయినా ఏలూరు లో టిడిపికి ఎవరు దిక్కు లేకుండా పోయారు . ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పేరు చెబితే మాజీ మంత్రి , మాజీ ఎంపీ మాగంటి బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1996 నుంచి ఈ పార్లమెంటు సీటు కు మాగంటి బాబు కు ఎంతో అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఒకసారి ఇక్కడ ఎంపీగా గెలిచిన బాబు ... 2009 ఎన్నికలకు ముందు టీడీపీ లోకి వచ్చారు. టిడిపి నుంచి మొత్తం మూడు సార్లు ఏలూరు ఎంపీగా పోటీ చేసిన మాగంటి బాబు 2014లో గెలిచి... మరో రెండుసార్లు ఓడిపోయారు. అయితే ఇప్పుడు మాగంటి రాజకీయం దాదాపు ముగిసినట్లే కనబడుతోంది.

మాగంటి రాజకీయ వారసత్వం నిలబెడతారని అనుకున్న ఇద్దరు కుమారులు కొద్ది నెలల క్రిందటే మృతి చెందారు. జిల్లా తెలుగు యువ త అధ్య‌క్షుడి గా ఉండి రాజ‌కీయాల్లో రాణిస్తోన్న మాగంటి రాంజీ కూడా మృతి చెంద‌డం మాగంటి అభిమానుల‌ను తీవ్రంగా క‌లిచి వేసింది. దీంతో మాగంటి కి రాజకీయ వారసత్వం లేకుండా పోయింది. ఇప్పటికే వయసు పైబడటం తో మాగంటి గతంలో అంత చురుకుగా ఉండటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా కష్టమే.

పైగా ఆర్థికంగా కూడా మాగంటి బాబు బలహీనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ బలమైన అభ్యర్థిని వెతకాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎవరో ఒకరికి సీటు ఇవ్వడం కంటే ... ఇప్పుడే ఇక్కడ వైసిపి కి ధీటుగా ఉండే అభ్యర్థిని ఎంపిక చేస్తే సదరు నేత ఇప్పటి నుంచి జనాల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పార్టీ కేడర్ భావిస్తోంది.

ఇక్క‌డ టీడీపీ ఎంపీ సీటు రేసులో మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామ‌య్య మ‌న‌వ‌డు బోళ్ల రాజీవ్ పేరుతో పాటు కొఠారు దొర‌బాబు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు లెక్క‌లు, ఈక్వేష‌న్లు ఎలా ?  ఉంటాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: