కేటీఆర్ సార్‌.. హైదరాబాద్‌ నడిబొడ్డున చెట్ల కింద చదువులు..?

Chakravarthi Kalyan
అదో ప్రభుత్వ కళాశాల.. అక్కడ చెట్ల కిందే లెక్చరర్లు పాఠాలు చెబుతున్నారు. ఎందుకంటే.. తగినన్ని తరగతి గదులు అక్కడ లేవు.. ఉన్న తరగతి గదుల్లో సౌకర్యాలు లేవు.. ఇలా చెట్ల కింద పాఠాలు చదువుకోవడం గురించి మనం చాలాసార్లు చదివాం.. ఇలాంటి పాఠశాలలు, కళాశాలల కథలు మనకు కొత్తేమీ కాదు.. మరి ఈ కళాశాల విషయంలో మాత్రం కొత్తేముంది అనుకుంటారా.. ఉంది. ఇలాంటి వసతులు లేని పాఠశాలలు, కళాశాలలు సాధారణంగా ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో ఉంటుంటాయి.

గిరిజన ప్రాంతాల్లో, కొండ కోనల్లో ఇలాంటి వసతుల లేమి సాధారణంగా చూస్తుంటాం.. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకునే కళాశాల మాత్రం తెలంగాణ రాజధాని అయిన ఘనత వహించిన హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉంటుంది. అవును.. ఇది నిజం.. మరి ఎక్కడ అంటారా.. ఈ డిగ్రీ కళాశాల ఉన్నది సీతాఫల్ మండిలో.. ఈ డిగ్రీ కాలేజ్ గురించి బీఎస్సీ తెలంగాణ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఆయన ట్విట్టర్‌లో ఏం పోస్టు చేశారంటే.. “ ఈ డిగ్రీ కళాశాల ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. హైదరాబాదు నడిబొడ్డున ఉన్న సీతాఫల్ మండి లో ఉంది. మన  భావితరాలు చెట్లకింద ఎట్ల చదువుతుండ్రో చూడండి. టాయిలెట్లు సరిగా లేక చాల మంది అమ్మాయిలు TC తీసుకున్నరు. ఇందుకోసమేనా శ్రీకాంతచారి త్యాగం చేసింది?? అందుకే ఏనుగునెక్కి ప్రగతి భవన్ పోవాలి.. అంటూ సీతాఫల్ మండి డిగ్రీ కాలేజ్‌ ఫోటోలు పెట్టి.. కింద కామెంట్‌ పోస్టు చేశారు.

ఈ ట్వీట్ చూస్తే ఔనా.. నిజమేనా అని ఆశ్చర్యపోక తప్పదు. మరి హైదరాబాద్ నడిబొడ్డున.. అది కూడా ఉస్మానియా యూనివర్శిటీకి అతి దగ్గరలో ఉన్న ఈ డిగ్రీ కాలేజ్‌ గురించి ఇంత వరకూ ఎవరూ పట్టించుకోకపోవడమేంటి.. ఈ విద్యార్థులు ఇబ్బందుల గురించి ఎవరూ ఆలోచించకపోవడం ఏంటి.. అయ్యా కేటీఆర్ సారూ.. మీరైనా కాస్త పట్టించుకుని ఈ సర్కారీ చదువులను కాస్త బాగు చేయండి సారూ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: