తెలుగు రాష్ట్రాల‌పై పీకే న‌జ‌ర్‌.. కేసీఆర్‌, జ‌గ‌న్ ప్లాన్ ఏంటి.?

Paloji Vinay
గ‌త ఎన్నికల్లో ఘ‌న‌విజయం సాధించిన రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. రాబోయే ఎన్నిక‌ల్లో కూడా గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని రెండు పార్టీలు ఇప్పుడు ప్ర‌శాంత్ కిషార్ టీం స‌హ‌కారం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గెలుపు వెనుక ప్ర‌శాంత్ కిషోర్ పాత్ర ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకే సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు జ‌గ‌న్ సిద్ధం అయ్యారు. వ‌చ్చే ఏడాది నుంచే ఐ ప్యాక్ టీం పార్టీ కోసం ప‌ని చేస్తుంద‌ని జ‌గ‌న్ క్యాబినెట్ మీటింగ్‌లోనే చెప్పుకొచ్చారు. ఈ సారి ఎన్నిక‌ల్లోనూ వైసీపీకి ప్ర‌శాంత్ కిషోర్ ప‌ని చేయ‌నున్నారు.

   జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా ఇప్పుడు బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీకి స్ట్రాట‌జిస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ల‌క్ష్యంగా ఇత‌ర పార్టీల‌ను ఏకం చేసే బాధ్య‌త‌లు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్ర‌ధానంగా బీజేపీని వ్య‌తిరేకిస్తున్న పార్టీల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇక తాజాగా టీఆర్ఎస్  అధినేత, సీఎం కేసీఆర్ సైతం బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఐ ప్యాక్ బృందానికి చెందిన స‌భ్యుల‌తో కేసీఆర్ స‌మావేశం అయిన‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది. ఐప్యాక్ స‌ర్వే బృందంగా చెబుతున్న వారితో జ‌రిగిన భేటీలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

 
 కాగా రాష్ట్ర ప్ర‌జ‌ల స్పంద‌న వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు కేసీఆర్ ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల పై ప్ర‌జ‌ల నాడీ ఎంటీ, టీఆర్ఎస్ నాయ‌కుల‌పై వ్య‌తిరేక‌త ఎందుకు వ్య‌క్తం అవుతుంద‌నే విష‌యాల‌పై స‌ర్వే చేయాల‌ని కేసీఆర్ సూచించిన‌ట్టు స‌మాచారం. ఐప్యాక్   నుంచి ప్ర‌స్తుతం స‌ర్వేల‌కు సంబంధించిన సేవ‌ల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌ని భ‌విష్య‌త్తులో అవ‌స‌రం అయితే, మ‌రిన్ని విస్తృత సేవ‌లు పొందాల‌ని యోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్ కోసం ప‌ని చేయడానికి సిద్ధ‌మైన ఐప్యాక్ బృందం కేసీఆర్ సూచించిన స‌ర్వేల‌ను మాత్ర‌మే చేస్తారా.. లేదా భ‌విష్య‌త్తులో టీఆర్ఎస్ కోసం ప‌ని చేస్తుందా అనేది స్ప‌ష్ట‌త లేదు. మ‌రి రానున్న రోజుల్లో పీకే టీం ను రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ విధంగా వాడుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: