ప్చ్‌.. వైసీపీలోకి వెళితే మిగిలింది జీరోయేనా ?

VUYYURU SUBHASH
ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధికార పార్టీ లోకి ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు ఉంటాయి. ప్రభుత్వం లో ఉన్న పార్టీలో చేరితే తమకు రాజకీయంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని విపక్ష పార్టీలకు చెందిన నేతలు భావిస్తూ ఉంటారు. అందుకే ఎన్నికలు పూర్తయ్యాక గెలిచిన పార్టీల‌లోకి ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయి. ఈ సంస్కృతికి బీజం వేసింది టీడీపీయే. 1999 తర్వాత ఎక్కువగా ఈ జంపింగ్ ల‌కు బీజం వేసింది చంద్రబాబే. అయితే ఆ తర్వాత 2014 లో రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కూడా విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో పోటీపడ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కూడా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుని మరి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ రాజకీయాల‌ పై తీవ్రమైన విమర్శలు వచ్చినా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. అయితే ఏపీ లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలోనే టిడిపి నుంచి పలువురు కీలక నేతలు అధికార వైసీపీ కండువా కప్పుకున్నారు. అధికార పార్టీలో చేరితే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన‌ పలువురు కీలక నేతలు జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

అయితే ఇప్పుడు వారు అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేక ... వారిని ఎవరు పట్టించుకునేవారు లేక లబోదిబోమంటున్న పరిస్థితి. అలా అని చెప్పి వారు వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి కూడా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నేత‌ల‌కు జ‌నాల‌తో పని లేకుండా పోయింది. జ‌నాల‌కు కావాల్సిన ప‌నులు అన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా అందుతుండ డంతో నేత‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించు కోవ‌డం లేదు. అయితే నేత‌ల‌కు కావాల్సిన ప‌నులు మాత్రం ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ర‌గులుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: