క‌మ్మ కులంలో ఇంత మార్పు వ‌చ్చిందా.. కార‌ణం ఏంటి..!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం అనేది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే ప్రారంభం అయింది. అయితే ఇది 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మరింతగా ముదిరిపోయింది. అప్పటివరకు రెండు కులాల మధ్య జరిగిన రాజకీయ ఆధిపత్యం మూడు కులాల మధ్య పోరాటంగా మారింది. ఇక జగన్ 2019 ఎన్నికలకు ముందు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేశారు. ఆయన కమ్మ సామాజిక వర్గం పై మిగిలిన వ‌ర్గాల్లో వ్యతిరేక భావనను బాగా పెంచి సక్సెస్ అయ్యారు.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆ సామాజిక వర్గం వారు భావిస్తున్నారు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార పరంగానూ అటు సినిమా రంగంలో కమలం కూడా క‌మ్మ‌ల‌ను జగన్ చాలా వ్యూహాత్మకంగా అణిచి వేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు.
2019 ఎన్నికల్లో కూడా 40 శాతం వరకు క‌మ్మ‌లు జగన్ కు అండగా నిలిచారు. జగన్ ఇప్పుడు చంద్రబాబు టిడిపిని లోకేష్ ను తిట్టాలన్నాకూడా ప్రధానంగా కమ్మ నేతలు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లని ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక లాభం లేదనుకున్న కమ్మ సామాజిక వర్గం దూకుడు పెంచుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా తాను కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటాం అని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో కమ్మలు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కు అండగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకే తెలంగాణలో హైదరాబాద్  లో జరుగుతున్న కమ్మ సామాజిక వర్గం కార్తీక మాస వన భోజనాల్లో కూడా కొడాలి నాని - వల్లభనేని వంశీ టార్గెట్ అవుతున్నారు. వీరంతా చంద్రబాబుకు అండగా ఉండేందుకు బలంగా నిర్ణయం తీసుకోవడం తోనే వంశీ లాంటి వాళ్ళు వెనక్కి తగ్గార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: