అక్కడ మళ్లీ లాక్ డౌన్.. వారికి మాత్రమే మినహాయింపు?

praveen
మొన్నటి వరకు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో అల్లాడి పోయాయి. మొదటి దశ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఊహించని వేగంతో రెండవదశ కరోనా వైరస్ దూసుకు వచ్చింది.  అన్ని దేశాలు అప్రమత్తం అయ్యేలోపే విపత్కర పరిస్థితులను తీసుకువచ్చింది. ఇక ఎంతోమంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితిని తీసుకు వచ్చింది. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగారు.

 అయితే ఇప్పటికే కొన్ని దేశాలు రెండవదశ కరోనా వైరస్ ప్రభావం నుంచి బయటపడగా.. కొన్ని దేశాలలో మాత్రం రెండవదశ  వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు.. ఇలాంటి సమయంలోనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని భయపెడుతూ ఉండడం గమనార్హం. ఓమిక్రాన్ అనే వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దీంతో ఇక ఈ వైరస్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాల లో అయితే ఈ కొత్త వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతూ ఉండటం గమనార్హం.

 దీంతో ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మళ్లీ కఠిన ఆంక్షలను  అమలులోకి తీసుకొస్తున్నాయి  అన్ని దేశాలు. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగి పోతూ ఉండడంతో యూరోప్ దేశమైన జర్మనీలో లాక్ డౌన్ విధిస్తూ ఇటీవలే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని  వైరస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి అంటూ ప్రభుత్వం తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది అంటూ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. జర్మనీలో టీకా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్లేందుకు వీలు లేదు అంటూ స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను  అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: