కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'తో మరణభయం లేనట్టేనా?

VAMSI
కరోనాతో రెండేళ్ల పాటు ఈ ప్రపంచమే అల్లాడి పోయింది. కరోనా తాకిడి తగ్గింది అనుకునే లోపు మహమ్మారి మరో రూపం ఎత్తి ప్రజల్ని వెంటాడుతోంది.  ఇపుడు ప్రపంచమంతా ఒమిక్రాన్ వేరియంట్ తో వణికిపోతుంది. ఇప్పటికే 30  దేశాలలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. కాగా ఈ మాయదారి వైరస్ భారత దేశం లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నవంబర్ 24 న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  ఇది శరవేగంగా విస్తరించే వేరియంట్ కావడంతో జనాలు భయాందోళనలు చెందుతున్నారు.
ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకుని చర్చించారు. అవసరమైతే లాక్ డౌన్ ప్రకటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కరోనా అయితే మనం వేసుకున్న టీకా ద్వారా శరీరంలో యాంటీ బాడీస్ పెరిగితే అరికట్టే అవకాశం ఉంది. కానీ ఈ ఒమిక్రాన్  వేరియంట్ మాత్రం యాంటీ బాడీస్ వల్ల తగ్గేది కాదని చెబుతున్నారు కొందరు వైద్య నిపుణులు. అయితే ప్రపంచ దేశాలలో పలు చోట్ల ఈ కొత్త వేరియంట్ ఉన్నప్పటికీ దీని కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా లేక పోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.  
 
ఇక కరోనా థర్డ్ వేవ్ కి ఇదే సూచకమా? కరోనా మూడవ దశ నిజంగా ఉందా? అన్న స్పష్టత మాత్రం ఇంకా శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా తేల్చి చెప్పలేక పోతున్నారు. ఇటువంటి సందిగ్ధంలో దేశం లోకి ఒమిక్రాన్ వేరియంట్ రాక సర్వత్రా భయాందోళనలు కలిగిస్తోంది. అయితే ఒక ఖచ్చితమైన అభిప్రాయం రావడానికి ఇంకో మూడు వారాల పాటు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: