స్నేహితుడిపై యుద్ధం చేస్తానంటున్న ఈటెల!

RATNA KISHORE
హుజురాబాద్ ఎన్నిక‌లు త‌రువాత ఎవ్వ‌ర‌యినా ఎప్పుడ‌యినా బీజేపీ పై మ‌న‌సు పెంచుకుని ఎక్క‌డ ఆ పార్టీ వైపు అడుగులు వేస్తారో అన్న భ‌యంతోనో బెంగ‌తోనో కేసీఆర్ త‌న స్టాండ్ మార్చేశారు. ఉన్న‌ట్టుండి కేంద్రాన్ని తిట్ట‌డం మొద‌లుపెట్టారు. కిష‌న్ రెడ్డి ని తిట్టారు. ఇదే స‌మ‌యంలో త‌న‌దైన పంథాలో ఉద్య‌మాలకు తాను సిద్ధం అని మీరు కూడా సిద్ధ‌మా అని ప్ర‌శ్నిస్తూ పిలుపునిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఈటెల.
రాజ‌కీయంలో ఎప్పుడు ఏమ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు. ఏదీ జ‌ర‌గ‌కుండా కూడా ఉండిపోనూ వ‌చ్చు. ఆ క్ర‌మంలో  కేసీఆర్ రాజ‌కీయం కొ న్ని సార్లు, ఈటెల రాజ‌కీయం మ‌రికొన్ని సార్లు ఫ‌లించి ఏదో ఒక దిశగా సంబంధిత ప‌రిణామాల‌ను న‌డ‌ప‌నూవచ్చు. కానీ శాశ్వ‌త శ త్రుత్వం అయితే ఉండ‌దు. ఒక‌ప్పుడు ఆ ఇంట స్నేహితుడిగా మెలిగిన ఈటెల ఇప్ప‌డు శ‌త్రువు అయిపోయారు. త‌మ నాయ‌కుడి పై తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత కావ‌డం విశేషం. హుజురాబాద్ లో ఈటెల గెలిచాక కేసీఆ ర్ త‌న ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పూర్తి వ్య‌తిరేకం అన్న విధంగా రాజ‌కీయం న‌డుపుతున్నారు. అదేవిధం గా ప్ర‌త్య‌క్ష పోరుకు సిద్ధం అయిపోయారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని తెర‌పైకి తెచ్చి నానా హ‌డావుడి చేస్తున్నారు కేసీఆర్.


కానీ ఓ విధంగా ఇదంతా బీజేపీని రాష్ట్రం బ‌ల‌ప‌డ‌కుండా ఉండేందుకు చేసిన ఎత్తుగ‌డే అని తేలిపోయింది. అయినా కూడా ఎక్క‌డా కేసీఆర్ త‌గ్గ‌డం లేదు. పూర్తిగా త‌మ వ‌ద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తేనే కేంద్రంను తాము నమ్ముతామ‌ని లేదంటే పోరు బాట కొన‌సాగిస్తామ‌ని కేసీఆర్ చెబుతున్నారు. ఇవ‌న్నీ ఓ విధంగా ఉంటే మ‌రోవైపు ప‌రిణామాలు మ‌రో విధంగా ఉన్నాయి. బీజేపీ బ‌లం పుంజుకున్నా, పుంజుకోక‌పోయినా రానున్న కాలంలో తాను మాత్రం కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉంటాను అన్న ధోర‌ణిలో ఈటెల ఉన్నారు. అందుకు త‌గ్గ విధంగా వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు. కార్య‌క‌ర్త‌లంద‌రినీ క‌లుపుకుని రానున్న కాలంలో మ‌రిన్ని  
ఉద్య‌మాలు చేసేందుకు సిద్ధం కావాలని యోచిస్తున్నారు ఈటెల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: