ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతల కలయిక.. బిజెపిని కలవరపెడుతోందా..!

MOHAN BABU
 తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ కొత్త ఊపుతో తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతూ  ముందుకు పోతున్నాయి. ఈ సందర్భంలోనే ఓవైపు కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎన్నికైన టువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్లో కొత్త జోక్స్ కనిపించింది. వచ్చీరాగానే రేవంత్ రెడ్డి నాలుగు సభలు, పది ఉపన్యాసాల లాగా కాంగ్రెస్ నేతలను ఉర్రూతలూగించారు. ఆయన అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు కానీ పార్టీలో ఉన్నటువంటి మిగతా కొంతమంది సీనియర్లకు రేవంత్ కు ఆ పదవి రావడం మింగుడు పడడం లేదు. దీంతో వారు రేవంత్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇలా కొద్ది రోజుల నుంచి ఇది తతంగం కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తోంది.

ఈ సందర్భంలోనే హుజరాబాద్ ఉప ఎన్నిక రావడం  అక్కడ కాంగ్రెస్కు ఘోరపరాభవం కావడం ఇంకా నేతలకు విమర్శలకు బలం చేకూరింది. ఇంకా రేవంతన్న గట్టిగా విమర్శించారు. దీంతో విషయం ఢిల్లీ అధిష్టానం చేరింది. ఇది ఎలాగైనా మార్చాలని ఢిల్లీ అధిష్టానం వారికి సర్ది చెప్పి పంపింది. ఈ క్రమంలోనే బిజెపి  హుజరాబాద్ లో విజయం సాధించడంతో కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతూ వస్తోంది. అయితే బిజెపి నేతలు ఎక్కువగా ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసమే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరియు ఇతర సీనియర్ నాయకులకు ఉన్నటువంటి వైరాన్ని  ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ సీనియర్ నేతలను తమ వైపు తిప్పుకోవాలని పావులు కదిపినట్టు తెలుస్తోంది. కానీ అనుకోకుండా బీజేపీ నేతలకు షాక్ తగిలింది..

 ఏమిటంటే  బద్ద శత్రువులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఇతర నాయకులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన వారి దీక్షలో కలిసి కూర్చోవడం చూసినటువంటి బీజేపీ నేతలకు  ఒక్కసారిగా మైకం కమ్మినట్టు అయిందని చెప్పవచ్చు. వారు ఆ దీక్షలో మా మధ్య ఎలాంటి గొడవ లేదని, కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలన్న బిజెపి పార్టీకీ భారీగా షాక్ తగిలింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: