ఆచంటలో పితానికి పవన్ సపోర్ట్ కావాల్సిందేనా?

M N Amaleswara rao
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు విషయంపై అనేక రకాలుగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయని కథనాలు వస్తున్నాయి...పైగా అంతర్గతంగా రెండు పార్టీల్లో కూడా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు వల్ల లాభనష్టాలని బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. అయితే రెండు పార్టీల నేతలు ఎక్కువ శాతం పొత్తు వల్ల లాభం ఉందనే తేలుస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలం పరిధిలో టీడీపీ-జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాయి. అక్కడ లోకల్ లీడర్లు అవగాహనకు వచ్చి పొత్తుతో ముందుకెళ్లి సక్సెస్ అయ్యారు. ఇక ఆచంట టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న పితాని వెంటనే దీనిపై స్పందించి...నెక్స్ట్ ఎన్నికల్లో పవన్‌ని కలుపుకుని వెళితే ఫలితం ఉంటుందని, దీనిపై ఆలోచించాలని పితాని, చంద్రబాబుకు సూచించారు.
వాస్తవానికి చూస్తే పవన్ కలిస్తే టీడీపీకి బెనిఫిట్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణా, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో బాగా ప్లస్ అవుతుంది. ఇక ఆచంట నియోజకవర్గంలో కూడా పితానికి బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసిన పితాని 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంటే చాలా తక్కువ మెజారిటీతో. అయితే అప్పుడు పవన్ కల్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ సపోర్ట్ వల్లే ఆ 4 వేల ఓట్లతో పితాని గెలిచారని చెప్పొచ్చు.
ఇక 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది...దీంతో ఆచంటలో ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచింది. టీడీపీపై వైసీపీ 12 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే..అక్కడ జనసేనకు పడిన ఓట్లు దాదాపు 14 వేలు. అంటే అప్పుడు కూడా టీడీపీ-జనసేన కలిస్తే మళ్ళీ పితాని గెలిచేసేవారు. అందుకే ఈ సారి మాత్రం పవన్‌ని కలుపుకుంటేనే బెటర్ అని పితాని అంటున్నారు. పితాని గెలవాలంటే పవన్ సపోర్ట్ తప్పనిసరి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: