కేసీఆర్ ప్లాన్‌ : త్వ‌ర‌లో అసెంబ్లీ ర‌ద్దు..?

Paloji Vinay

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ధాన్యం కేంద్రంగా ఈ రెండు పార్టీలు రాజ‌కీయాల‌కు చేస్తున్నాయి. స‌మ‌స్య‌లు విన్న‌వించుకోవ‌డానికి కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళ్తే వినిపించుకోవ‌డం లేద‌ని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాన రైతుల‌ను నిండా ముంచింద‌ని విమ‌ర్శించారు. దేశంలో 750 మంది రైతుల‌ను బీజేపీ పొట్ట‌న‌పెట్టుకుంద‌ని కేసీఆర్ ఆరోపించారు. వానాకాలం ధాన్యానికే దిక్కు లేద‌ని, రా రైస్ ఎంత కొంటుందో కేంద్రం ఇప్ప‌టికీ చెప్ప‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము రైతు బంధుల‌మ‌ని, బీజేపీ రాబంధుల‌ని గులాబీ బాస్ విమ‌ర్శించారు.



  బీజేపీ పాల‌న కంటే త‌మ ప్ర‌భుత్వం కోటి రేట్లు మంచి పాల‌న అందిస్తుంద‌ని చెప్పారు కేసీఆర్. దేశంలో రైతులు బాగుప‌డాలంటే కేంద్రం నుంచి బీజేపీ ప్ర‌భుత్వాన్ని పార‌ద్రోలాల్సిన అవస‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు. మూడు రైతు చ‌ట్టాలు మంచివి అయితే ఎందుకు ర‌ద్దు చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. రైతుల‌కు ప్ర‌ధాని ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాడ‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో తెలంగాణ రైతుల‌కు కూడా క్ష‌మాప‌ణ చెప్పాల్సిన స‌మ‌యం వ‌స్తుంద‌ని జ్యోష్యం చెప్పిన  కేసీఆర్‌.. త‌మ మెడ‌పై క‌త్తి పెట్టార‌ని వ్యాఖ్యానించారు.



   కేసీఆర్ మాటల‌కు బీజేపీ రాష్ట్ర నాయ‌కుడు బండి సంజ‌య్ కౌంట‌ర్ ఇచ్చారు. మెడ‌పై క‌త్తి పెడితే ఫాంహౌజ్ రాసి ఇస్తావా అని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పిచ్చిముదిరింద‌ని, కేంద్రంపై మాట్లాడే మాట‌లు ఇవేనా అన అన్నారు. జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని కేసీఆర్ మాట‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని అన్నారు. పండిన ప్ర‌తిపంట‌ను నువ్వే కొంటా అన్నావ్ అంటూ కేసీఆర్ పై మండిప‌డ్డారు. అలాగే బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణా సాగ‌ర్ రావు కేసీఆర్ మాట‌ల‌పై స్పందించారు. ఈ సారి తెలంగాంణ‌లో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతాయో లేదో త‌న‌కు అనుమానంగా ఉంద‌న్నారు. కేసీఆర్ త్వ‌ర‌లో అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని అంచ‌నా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: