ఆ వార్తల్లో నిజం లేదు.. సజ్జనార్ క్లారిటీ?

praveen
ఒకప్పుడు సైబరాబాద్ సీపీ గా కొనసాగిన సజ్జనార్ ఇక ఇటీవల తెలంగాణ ఆర్టీసీ సంస్థకు ఎండీగా బాధ్యతలు చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఇలా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రోడ్డు రవాణా సంస్థను ప్రజలు అందరికీ చేరువ చేసేందుకు ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని అందుకే ఎన్నో రకాల డిపోలను మూసి వేస్తున్నారని.. ఇక ఆర్టీసీ సంస్థకు సంబంధించిన భూములను కూడా అమ్మకానికి పెడుతున్నారు అన్న వార్తలు గత కొంత కాలం నుంచి వైరల్ గా మారిపోతున్నాయి. దీంతో ఇది నిజమా కాదా అని తెలియక ప్రజలను అయోమయంలో పడిపోతున్నారు.

 తాజాగా టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ ఈ విషయంపై స్పందిస్తూ పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ డిపోలు మూసేస్తున్నారు అని భూములను అమ్ముతున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని ఆర్టీసీ  యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు అంటూ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులలో సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ వైపు మళ్లుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల నుంచి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల వల్ల అటు ఆర్టీసీ ఆదాయం ఎంతగానో పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు..

 ఆర్టీసీ భూములను అమ్మాలనే ఆలోచన అటు యాజమాన్యానికి ఏమాత్రం లేదు అంటూ వ్యాఖ్యానించారు. 1359 రూట్లలో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక బస్సులు అవసరం అనుకున్న చోట లోకల్ డి ఎమ్, ఆర్ యం లు సర్వేలు నిర్వహిస్తూ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డిపో మేనేజర్ ని సంప్రదించాలని సూచించారు. జోగులాంబ కు వెళ్ళినప్పుడు భక్తులు బస్సు సర్వీసులు కావాలని కోరారు. ఈ క్రమంలోనే వచ్చే శనివారం నుంచి జోగులాంబ కు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతుంది అంటూ చెప్పుకొచ్చారు. డీజిల్ పెరుగుదల వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యం అంటూ సజ్జనార్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: