ఆ కంచుకోటని వైసీపీ ఈ సారి లాస్ అవ్వాల్సిందేనా?

M N Amaleswara rao
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో రాజకీయం మారుతుంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలిచేసింది. అలా భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు సరైన పనితీరు కనబర్చకపోవడం వల్ల..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అది గానీ కాస్త టీడీపీకి బెనిఫిట్ అయితే రాజకీయం మొత్తం మారిపోయేలా ఉంది. అప్పుడు ఆ సీట్లని వైసీపీ లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలా వైసీపీ లాస్ అయ్యే వాటిల్లో గూడూరు కూడా ఒకటి అనిపిస్తోంది. అసలు గూడూరు అంటేనే వైసీపీకి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. 2014 ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ తరుపున పాశిం సునీల్ కుమార్ విజయం సాధించారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో పాశిం సునీల్ కుమార్...వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేశారు.
 దీంతో 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుపున బరిలో దిగారు. ఇక వైసీపీ తరుపున వరప్రసాదరావు పోటీ చేశారు. రాజకీయంగా గూడూరులో వరప్రసాదరావుకు పెద్ద పట్టు లేదు. కానీ గూడూరులో వైసీపీకి బలం ఎక్కువ. పైగా జగన్ వేవ్ ఉండటంతో ఆ ఎన్నికల్లో వరప్రసాదరావు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచేశారు. భారీ మెజారిటీతో గెలిచిన వరప్రసాదరావు వల్ల ఈ రెండున్నర ఏళ్లలో గూడూరు ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదు. ఏదో ప్రభుత్వం తరుపున వచ్చే సంక్షేమ పథకాలు....జరిగే అభివృద్ధి పథకాలు మినహా, ఎమ్మెల్యేగా ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలు, దందాలు కూడా ఎక్కువే అనే ప్రచారం జరుగుతుంది.
ఈ పరిణామాల వల్ల గూడూరులో వైసీపీకి బాగా యాంటీ పెరిగింది. స్థానిక సంస్థల గెలుపు కూడా జగన్ ఇమేజ్ వల్లే వచ్చింది. అయితే ఎమ్మెల్యేపై యాంటీ నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీపై పడితే...గెలుపు కష్టమైపోతుంది. అనవసరంగా కంచుకోటని వైసీపీ లాస్ అవ్వాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: