జ‌గ‌న్‌ను సొంత జిల్లాలోనే ఓడిస్తా.. ఈ సీనియ‌ర్ శ‌ప‌థం..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ సారి సొంత జిల్లాలోనే ఎదురీత‌లు తప్పేలా లేవు. గత 20 సంవత్సరాల నుంచి కడప జిల్లా ప్రజలు వైఎస్ ఫ్యామిలీ కి అండగా ఉంటూ వస్తున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసిపి రాజంపేట సీటు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది. గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఎమ్మెల్యే సీట్లతో పాటు కడప - రాజంపేట ఎంపీ సీట్లలో కూడా వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. వైసిపి ఆవిర్భావం నుంచి కడప జిల్లా ప్రజలు జగన్ కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సారి ఐదారు నియోజకవర్గాల్లో వైసీపీకి బిగ్ షాక్ తప్పేలా లేదు.
ఇటీవల రాజంపేట - కమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీ మంత్రి డీఎల్‌. ర‌వీంద్రా రెడ్డి చక్రం తిప్పడం తోనే అక్కడ టిడిపి కొన్ని వార్డుల్లో విజయం సాధించింది. జగన్ అధికారంలోకి వచ్చాక సీనియర్ గా ఉన్నా డీఎల్ ను ఎలాంటి పదవి లేకుండా పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన మైదుకూరులో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ ని ఓడించి తీరుతామని శ‌ప‌థం చేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ పర్యటించి వైసిపి ప్రభుత్వం తీరును ఎండ గ‌ట్టేందుకు రెడీ అవుతున్నారట.
మైదుకూరు నియోజకవర్గం లో డిఎల్ రవీంద్రా రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన ఈ వయసులో కూడా జనాల్లోకి వెళ్లి తన సత్తా ఏంటో చూపించాలన్న ఆలోచనతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో జ‌రుగుతోన్న దోపిడీ ని ప్రజలకు వివరించాలని... అలాగే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు జరిగిన అన్యాయాన్ని కూడా మైదుకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వివ‌రించాల‌ని ఆయన భావిస్తున్నారట. ఇక డి.ఎల్.రవీంద్రారెడ్డి తో పాటు మరికొందరు నేతలు కూడా కడప జిల్లాలో వైసీపీకి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: