టీఆర్ఎస్‌లో ఒక్క సీటు కోసం ఇంత పోటీయా...!

VUYYURU SUBHASH
తెలంగాణలో త్వరలో కాళీ కానున్న రాజ్యసభ స్థానం కోసం అధికార టీఆర్ఎస్ నేతలు అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ ఒక్క పదవి కోసం ఏకంగా 20 మంది నేతలు పోటీలో ఉన్నారు. తెలంగాణలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్ ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఇటీవ‌ల ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఆ సామాజిక వర్గం అంతా కెసిఆర్ పై ఆగ్రహంతో ఉంది. ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ ప్ర‌కాష్ ముదిరాజ్‌ను త‌న కేబినెట్లోకి తీసుకోనున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ను ముందుగా ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన రాజీనామా చేసే రాజ్య‌స‌భ స్థానం కోసం మరో 20 మంది నేతలు అధికారికంగా... మ‌రో 20 మంది నేతలు అనధికారికంగా పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియ‌ర్ల‌కు అవకాశం ఉందా ? లేదా పార్టీలో బీటీ బ్యాచ్ నేతలకు అవకాశం ఇస్తారా ? అన్న‌ది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఈ ఒక్క పదవి కోసం ఒక జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ, కేసీఆర్ స‌మీప బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మ‌రో మాజీ మంత్రి మండ‌వ వెంకటేశ్వరరావు - మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - మోత్కుపల్లి నర్సింహులు ఇలాంటి నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎవ‌రి ఆశ‌లు ? ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా .. మరి కేసీఆర్ ఆశీస్సులు ఫైనల్ గా ఎవరికీ ఉంటాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: