ఆ లేడీ లీడ‌ర్‌కు లోకేష్ స‌పోర్ట్‌.. మాజీ మంత్రిలో టెన్ష‌న్‌...!

VUYYURU SUBHASH
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళి అస‌లు టీడీపీలోనే ఉంటున్నారా ? లేదా ఆయ‌న ఏ పార్టీలో ఉన్నారో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఆయ‌న పార్టీలో ఏదో ఉన్నారు ? అనుకుంటే అనుకోవాలి.. లేక‌పోతే లేదు అనుకోవాలి. కోండ్రు మురళి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైఎస్సార్ తో పాటు రోశ‌య్య‌,, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రి గా కూడా ప‌నిచేశారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే 2019 ఎన్నికల కు ముందు చంద్ర‌బాబు ఆయ‌న్ను టీడీపీ లోకి ఆహ్వానించి మ‌రి టిక్కెట్ ఇచ్చారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న పార్టీ సీనియ‌ర్ నేత కావ‌లి ప్ర‌తిభా భార‌తిని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ ముర‌ళీ కి సీటు ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో రాజాం లో టీడీపీ నుంచి పోటీ చేసిన ముర‌ళీ వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాల ను ప‌ట్టించు కోవడం లేద‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి.
పైగా పార్టీ స్టాండ్ కు వ్య‌తిరేకంగా జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన కోండ్రు మురళి చంద్రబాబు ఆగ్రహానికి కూడా గుర‌య్యార‌నే చెప్పాలి. ఇక చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష అప్పుడు కూడా ఆయ‌న క‌న‌ప‌డ లేదు. ఇక పార్టీ నాయకత్వం మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు రాజాం నియోజకవర్గంలో మద్దతుగా ఉంటోంది. దీంతో ముర‌ళీకీ చెక్ ప‌డిన‌ట్టే అంటున్నారు.
ఇక అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడి గా ఉన్నా కూడా ముర‌ళీ ఆయ‌న్ను క‌లిసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. పైగా ప్ర‌తి భ కుమార్తె గ్రీష్మకు లోకేష్ మద్దతు లభిస్తుందని తెలిసి కోండ్రు మురళి చాలా సైలెంట్ అయిపోయార‌నే అంటున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ కూడా లేద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: