గుడివాడలో సీన్ రివర్స్: రావికి డౌట్ ఉందా...?

VUYYURU SUBHASH
గుడివాడ అంటే ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట అనే మాట వినిపించేది. కానీ ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాని పేరు మాత్రమే వినిపిస్తోంది. గుడివాడలో నానికి ఇంకా తిరుగులేని పరిస్తితి ఉందనే చెప్పొచ్చు. టీడీపీ ఎక్కడా కూడా నానికి పోటీ ఇవ్వలేకపోతుంది. అసలు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గుడివాడలో టీడీపీకి ఈ పరిస్తితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా నాని టీడీపీలో ఉన్నప్పుడు మరో నాయకుడు గుడివాడలో ఎడగలేదు. టీడీపీ సైతం...బలమైన రావి ఫ్యామిలీని సైడ్ చేసేసింది.

దీంతో నాని వైసీపీలోకి వెళ్ళాక టీడీపీకి బలమైన నాయకత్వం దొరకలేదు. రావి వెంకటేశ్వరావుని మళ్ళీ తీసుకొచ్చిన సరే ప్రయోజనం లేకుండా పోయింది. పోనీ ఆయన్ని కంటిన్యూ చేస్తున్నారా? అంటే అది చేయలేదు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చారు. ఆయన ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో మళ్ళీ రావిని తీసుకొచ్చి ఇంచార్జ్‌గా పెట్టారు.

ఇక వైసీపీ అధికారంలో ఉండటం, పైగా కొడాలి మంత్రిగా ఉండటంతో రావి బయటకు రావడం లేదు. ఎక్కడ ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో గుడివాడలో టీడీపీ పరిస్తితి దిగజారిపోతుంది. అలా అని ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ లేకుండా లేదు. ఇక్కడ క్యాడర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. క్యాడర్ ఎప్పటికప్పుడు స్థానికంగా పార్టీని బలంగానే ఉంచుకుంటున్నారు. అసలు పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ చాలా గ్రామాల్లో గెలిచిందంటే...దానికి కారణం టీడీపీ క్యాడర్ మాత్రమే.

పైగా ఇప్పుడుప్పుడే నానిపై కూడా వ్యతిరేక మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. న్యూట్రల్ వర్గాలు నాని పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి దూకుడుగా ఉంటే ఫలితం ఉంటుంది. కానీ రావి మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఆయన నెక్స్ట్ సీటు వస్తుందా? రాదా? అనే డౌట్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే త్వరగా బయటకు రావడం లేదు. అయితే గుడివాడలో ఈ అనిశ్చితిని చంద్రబాబే తొలగించాలి. అప్పుడే నెక్స్ట్ ఎన్నికల్లో నానికి టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: