కాంగ్రెస్ ప్రక్షాళన కోసం.. రేవంత్ టీమ్ రెడీ అయిందా..!

MOHAN BABU
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలో అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులను మార్చుకున్నారని పనిచేసే లీడర్లకే పట్టం కట్టాలని ఆయన భావించినట్లు  తెలుస్తోంది. ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కొత్త సంవత్సరం మొదలు నుంచి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎవరినీ నియమించాలని అనుకున్నప్పుడు అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధిష్టానం దూతలు రాష్ట్రానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేపట్టి ఇందులో డిసిసి అధ్యక్షుల యొక్క అభిప్రాయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు అత్యధికంగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

 దాదాపు 20 జిల్లాల అధ్యక్షులు రేవంత్ రెడ్డి జై కొట్టారని సమాచారం. మిగతావాళ్లంతా ఎక్కువమంది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ప్రతిపాదించారని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కొంత పట్టు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు డిసిసి అధ్యక్షుల నియామకాలు తన వర్గానికి ప్రాధాన్యం కల్పించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు అని చెప్పవచ్చు. అయితే కోమటిరెడ్డి అంటే పడని రేవంత్ టీం ఆ పని చేస్తుందా అనే అనుమానం కార్యకర్తల్లో వస్తోందని టాక్. చాలా జిల్లాల్లో కొంత మంది అధ్యక్షులుగా చాలా సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి  నియమించిన వారు ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. ఇందులో కొందరు పనితీరు ఏ మాత్రం బాగా లేదని ఇందులో కొంతమంది తప్పించి కొత్త వ్యక్తులను ఎక్కించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో యాభై ఏళ్ళ లోపు ఉన్న యువతకు అవకాశం ఉంటుందా అనేది పార్టీ శ్రేణులు ఎదురుచూస్తూ ఉన్నారు.

 పనిచేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు. రేవంత్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జరిగిన బహిరంగ సభలు పార్టీ కార్యక్రమాలు ఏదైనా చాలా విజయవంతంగా కొనసాగాయి.  ఈ సభలు విజయవంతం కావడానికి ఎవరెవరు ఆసక్తి చూపారు ఎక్కువగా పనిచేశారు అనే దానిమీద, మరియు సభ్యత్వం నమోదు లో ఎవరి పని తీరు ఎలా ఉందో   అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని నియామకాలను చేపడతారని టాక్. నియోజకవర్గ నాయకులకు కూడా ఈ అంశాలే దీటుగా  ఉంటాయని తెలుస్తోంది. వీరిలో ఎవరి పనితీరు బాగుందో చూసి  పార్టీ పదవులు కేటాయిస్తారని సమాచారం. ఈ విధంగా రేవంత్ కొత్త వ్యూహంతో తెలంగాణలో కాంగ్రెస్ సమూల ప్రక్షాళన చేయనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: